Home / movie news
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా రిలీజయిన హరి హర వీర మల్లు యొక్క 'పవర్ గ్లాన్స్' యూట్యూబ్‌లో సంచలనం రేకెత్తించింది. ఒక రోజు వ్యవధిలో, 'పవర్ గ్లాన్స్' 10+ మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి యూట్యూబ్ లో అగ్రస్థానంలో ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజిత్‌తో చర్చలు జరుపుతున్నారు. వీరిద్దరి కాంబోలో చిత్రం వస్తుందని గత కొద్దికాలంగా ఊహాగానాలు వెలువుడుతున్నాయి. ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ థెరికి రీమేక్ అని కూడ టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ప్రణాళికలు మారాయి.
హీరో శర్వానంద్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు మాత్రమే చేస్తానని ఇటీవల ప్రకటన చేశాడు. శర్వానంద్ తన 33వ సినిమా కోసం కృష్ణ చైతన్యతో జతకట్టాడు. శర్వానంద్ 33వ చిత్రం విభిన్నమైన కథ మరియు శక్తివంతమైన పాత్రలతో కూడిన రాజకీయ యాక్షన్ డ్రామా.
నటి తమన్నా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్‌తో బబ్లీ బౌన్సర్ సినిమా కోసం జతకట్టింది. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. తమన్నా బౌన్సర్లను ఉత్పత్తి చేసే ఫతేపూర్‌కు చెందిన బబ్లీ అనే యువతి పాత్రను పోషిస్తుంది.
సెప్టెంబర్ 16న భారతదేశంలో జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినీ ప్రియులందరికీ భారతదేశం అంతటా అన్ని సినిమాలకు భారీ ధర తగ్గింపు లభించనుంది.
లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం జనగణమన పై దాని ప్రభావం పడింది. ఈ సినిమా నిర్మించే మై హోమ్ గ్రూప్ ప్రాజెక్టును వదిలేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది.
ఈ మధ్య సినీ ఫీల్డ్ లో కొత్త ట్రెండు నడుస్తుంది అది ఏంటంటే సినిమా విడుదల అయ్యే ముందు, విడుదల అయ్యాక, సినిమా మంచి విజయం సాధించినప్పుడు దేవుని ఆశీస్సులు కోసం దేవుని గుళ్ళకు వెళ్తున్నారు. సాధరణంగా అన్నీ సినిమా వర్గాల వారు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు.
ప్రస్తుతం కొనసాగుతున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొన్ని కీలక ప్రకటనలను విడుదల చేసింది. ఒక నెల విరామం తర్వాత, సెప్టెంబర్ 1 నుండి షూట్లు పూర్తిగా తిరిగి ప్రారంభమయ్యాయి. నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు రోజువారీ చెల్లింపులు ఉండవు.
కార్తికేయ2 ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను తాకింది. ఈ చిత్రం గ్రాస్ ఇప్పుడు రూ.101.50 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ షేర్ దాదాపు 48 కోట్లు. ఈ చిత్రం తో హీరో నిఖిల్ 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ప్రవేశించాడు
శర్వానంద్, రీతువర్మ జంటగా శ్రీ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం ఒకే ఒక జీవితం. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒకే ఒక జీవితం తల్లి-కొడుకుల బాండింగ్‌తో కూడిన ఒక సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.