Home / movie news
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇక తెలుగు ప్రజలు అయితే ఆమెను చూసి "ఏమాయచేశావే" అంటారు. "మనం" అంటూ ఆమెపై ఆత్మీయత చూపుతారు. తన అందచందాలతో నటనతో అభిమానులను టాలీవుడ్ "మజిలి"కి చేర్చిన అందాల భామ.
నటి సమంత ఇటీవల కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పూజారుల బృందం పాల్గొని ఆమెను ఆశీర్వదించారు. సమంత పూజకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
కిరణ్ అబ్బవరం, తన తదుపరి చిత్రం ’నేను మీకు బాగా కావాల్సినవాడిని‘లో మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఇటీవలి నెలల్లో ఆసక్తిని రేకెత్తించే టీజర్ మరియు పాటలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మాస్ ఎంటర్టైనర్కి కిరణ్ అబ్బవరం స్వయంగా స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించగా శ్రీధర్ గాధే దర్శకత్వం వహించారు.
మెగాస్టార్ అభిమానులంతా గాడ్ ఫాదర్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఆచార్య మూవీ మెగాఫ్యాన్స్ ను నిరాశపచడంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న గాడ్ ఫాదర్ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
మాస్ మహారాజ రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసురుడు సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుధీర్ వర్మ వర్కింగ్ స్టైల్‌తో ఇంప్రెస్ అయిన రవితేజ అతనికి దర్శకుడిగా మరో అవకాశం ఇచ్చాడు.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం పై గత కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను, క్రిష్ వంటి దర్శకుల పేర్లు ఊహాగానాలు జరిగాయి. కానీ ఏ ఒక్కటీ కన్ ఫర్మ్ కాలేదు. ఇప్పుడు అతని అరంగేట్రం గురించి మరలా వార్తలు వచ్చాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజీత్ తో కలిసి పని చేయనున్నారు. ప్రస్తుతానికి ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ అని మరియు పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ డాన్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
బుల్లి తెర టీవీ యాంకర్‌గా తన జీవితం మొదలుపెట్టి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కూడా ఒకరు. శివ కార్తికేయన్ కొత్త నిర్ణయాలను తీసుకొని వాటిని అమలు చేయడానికి రెడీగా ఉన్నారని తెలిసిన విషయం. తెలుగు సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు.
చాలా రోజుల నుంచి సమంతా సోషల్ మీడియాకు, ఆమె అభిమానులకు దూరంగా ఉంటుంది. కారణం ఏం అయి ఉంటుందో తెలీదు. ప్రస్తుతం సమంతా నటిస్తున్న సినిమా "యశోద" ఈ సినిమాకు హరి హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవ్వనుంది.
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత నుంచి సమంతా మీద ఎన్నో రుమార్లు వస్తున్నాయి కానీ ఈ అమ్మడు మాత్రం ఒక్క డానికి కూడా సమాధానం చెప్పకుండా తన పని తాను సంతోషంగా చేసుకుంటుంది. ఈ రుమార్లు నాకు కొత్తేమీ కాదు నాకు ఇవి కామన్ అంటూ సిల్లిగా తీసుకొని వదిలేసింది.