Home / movie news
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కీలక పాత్ర పోషించారు. మొదట్లో దీన్ని చేయడానికి ఇష్టపడకపోయినా చిరు కోసమే చేశారు. తన ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో, ఈ సినిమాలో నటించడానికి పూరి విముఖత చూపాడంటూ చిరు చెప్పారు.
ఫ్యాక్షనిజానికి హీరోయిజమ్ జోడించి ప్రేక్షకులను మెప్పించి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లను సాధించిన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలోనే బాలకృష్ణ నటించిన చిత్రం ‘చెన్నకేశవరెడ్డి’. శ్రీసాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ ఈ మూవీని నిర్మించారు. 2002 సెప్టెంబర్ 25న ‘చెన్నకేశవరెడ్డి’ ప్రేక్షకుల ముందు విడుదలై అపూర్వ విజయాన్ని సాధించింది.
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కొత్త సినిమా ‘ది ఘోస్ట్’ సినిమా. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా, ప్రస్తుతం ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నాగార్జునకు జంటగా సోనాల్ చౌహాన్ హీరోయిన్నుగా నటించింది.
సమంత అభిమానులకు గుడ్ న్యూస్. శాకుంతలం మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. అందాల తార సమంత కీలక పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం మూవీ రిలీజ్ డేట్‌ను మూవీ యూనిట్ అఫీషియల్ గా ప్రకచించింది. నవంబర్ 4న ఈ చిత్రం థియోటర్ల వద్ద సందడి చేయనుంది. ఈ మేరకు చిత్ర బృందం కొత్త ఫొటోతో పాటు ఓ మోషన్ పోస్టర్‌ను అభిమానుల కోసం షేర్ చేసింది.
టాలీవుడ్ అత్యుత్తమ మాస్ దర్శకుల్లో వివి వినాయక్ ఒకరు. సుదీర్ఘ విరామం తర్వాత, అతను టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం చత్రపతిని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్నాడు.
హీరోలు, హీరోయిన్స్ టాలెంటు ఉన్న దర్శకులతో పనిచేయాలనుకుంటారు. అలాంటి వారిలో మౌని రాయ్ కూడా ఒకరు. తాజాగా ఈమె మన టాలీవుడ్ దర్శకుడు పైనా కన్నేసినట్టుంది. ఆ దర్శకుడు ఎవరు అని సందేహిస్తున్నారా, అతను ఎవరో కాదండీ మన జక్కన్న.
ఇప్పటికైనా మంచి కథలు ఎంచుకోవాలని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చెయ్యాలని, కొన్నాళ్ళు రెమ్యూనరేషన్ పక్కనపెట్టి సినిమాలు చెయ్యాలని, లేదంటే మరికొన్ని సినిమాలు చేసి ఇక ఇంటికి బ్యాగ్ సర్దుకోవాల్సి వస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అరుదైన ఘనత సాధించాడు. దేశంలోనే మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిలిం స్టార్ గా చరిత్రకెక్కాడు. దీనికి సంబంధించి ఆర్నాక్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తన నగ్నఫోటోలలో ఒకటి మార్ఫింగ్ చేయబడిందని ముంబై పోలీసులకు చెప్పాడు. తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో షూట్‌లోని ఫోటోలలో ఈ ఫోటో లేదని అతను ఖండించాడని పోలీసు అధికారి గురువారం తెలిపారు.
కింగ్ నాగార్జున వచ్చే ఏడాది తన 100వ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు వార్త ఇప్పటికే చిత్రపరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఇది మన్మథుడి కెరీర్లో మైల్‌స్టోన్‌లా నిలిచిపోయేలా ఉండాలన్నట్టు నాగ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి ఈ ప్రాజెక్టు కోసం నలుగురు డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించారంట.