Last Updated:

Prabhas: దేశంలోనే టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అరుదైన ఘనత సాధించాడు. దేశంలోనే మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిలిం స్టార్ గా చరిత్రకెక్కాడు. దీనికి సంబంధించి ఆర్నాక్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Prabhas: దేశంలోనే టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా ప్రభాస్..!

Tollywood: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అరుదైన ఘనత సాధించాడు. దేశంలోనే మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిలిం స్టార్ గా చరిత్రకెక్కాడు. దీనికి సంబంధించి ఆర్నాక్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.

బాహుబ‌లితో అంత‌ర్జాతీయ స్థాయిలో ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ్లాప్ లుగా మిగిలాయి. అయినా ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్ర‌స్తుతం దేశంలో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా ప్ర‌భాస్ నిలిచాడు. ఒక్కో సినిమాకు దాదాపు రూ.120 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడనే టాక్ సినీ పరిశ్రమ నాట ఉంది. కాగా ప్రస్తుతం ప్ర‌భాస్ లైన్ లో ఉన్న‌ సినిమాలే దాదాపు రూ.2000కోట్ల వ‌ర‌కు బిజినెస్‌ను జ‌రుపుకుంటాయ‌ని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో డార్లింగ్ అరుదైన ఘనత సాధించాడు.

ప్రముఖ మీడియా సంస్థ‌ ఆర్మాక్స్ ప్ర‌తినెల‌ దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే చేపట్టి, టాప్ పొజిషన్‌లో ఉన్న సినీతారల గురించి జాబితాలను విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆగ‌స్టు నెల‌కు సంబంధించి మోస్ట్ పాపుల‌ర్ మేల్ తెలుగు ఫిలిం స్టార్స్‌ స‌ర్వే జాబితాను ఆర్మాక్స్ విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ప్ర‌భాస్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్ర‌భాస్ త‌ర్వాత ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్ వ‌రుస స్థానాల్లో ఉన్నారు. జూలై నెల‌లో కూడా ప్ర‌భాస్‌ టాప్ ప్లేస్‌లోనే ఉన్నాడు. ఇక హీరోయిన్‌ల‌లో స‌మంత, కాజ‌ల్ మొదటి రెండ‌ు స్థానాల్లో ఉన్నారు.

ఇదీ చదవండి:  అక్టోబర్ 23న “వర్షం” రీ రిలీజ్..!

follow us

సంబంధిత వార్తలు