Home / movie news
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం “దసరా” బడ్జెట్ సమస్యల్లో చిక్కుకుందని కొంతకాలం క్రితం పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత మొత్తం ప్రాజెక్టును వేరొకరికి ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే నిర్మాత సుధాకర్ చెరుకూరి వాటన్నింటని కొట్టిపారేశారు.
నటి దివి వడ్త్యా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఇటలీకి సోలో ట్రిప్‌లో ఉంది. ఆమె భారతదేశాన్ని విడిచిపెట్టడం ఇదే మొదటిసారి మరియు ఆమె హాలీవుడ్ చిత్రం ఈక్విలైజర్ 3 సెట్ కి వెళ్లడంతో ఈ పర్యటన మరింత చిరస్మరణీయంగా మారింది.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అఖండ సూపర్ సక్సెస్ తర్వాత, బాలయ్య తన రెమ్యూనరేషన్ పెంచారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ సినిమా టీజర్ పై సోషల్ మీడియాలో ఒక రేంజులో ట్రోల్స్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి జనం ఎవరిష్టం వచ్చినట్టు వారు సినిమా టీజర్ గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం వచ్చే వారం విడుదలకానుంది. ఇది కాకుండా చిరు వాల్తేర్ వీరయ్య మరియు భోళా శంకర్ల సినిమాలు కూడ షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి.
సీనియర్ నటుడు ఆనంద్, మురళీ కృష్ణం రాజు, మెహబూబ్ షేక్, రాకేశ్ మాస్టర్ ముఖ్య మైన పాత్రల్లో నటిస్తున్న సినిమా " స్కై ". ఈ సినిమాకు పృధ్వీ పేరిచర్ల దర్శకత్వం వహించగా, నాగిరెడ్డి గుంటక, మురళీ కృష్ణం రాజు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా తెలుగు సినీ పరిశ్రమలోకి ‘చిరుత’గా అడుగుపెట్టి, ఆ తర్వాత సినిమా ‘మగధీర’తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, రికార్డ్ లన్ని తిరగరాసి మెగా తనయుడు నుంచి మెగా ధీరుడుగా మారాడు. నేటికీ 15 ఏళ్ళు తన నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ఓరి దేవుడా సినిమా నుంచి "అవుననవా " పాట విడుదలైన సంగతి మనకి తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇస్మార్ట్ శంకర్ "తో రామ్ పోతినేని హిట్ కొట్టినప్పటికీ రెడ్ మరియు వారియర్ ఫ్లాప్‌లు అతడిని బాగా దెబ్బతీశాయి. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం బోయపాటి శ్రీనుతో రామ్ కొత్త చిత్రం ఫైనాన్స్ సమస్యల కారణంగా ముందుకు సాగలేదు.
ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ను 2020 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా ఎంపికచేసినట్లు సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.