Bala krishna: 20 ఏళ్లు పూర్తిచేసుకున్న “చెన్నకేశవ రెడ్డి”
ఫ్యాక్షనిజానికి హీరోయిజమ్ జోడించి ప్రేక్షకులను మెప్పించి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లను సాధించిన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలోనే బాలకృష్ణ నటించిన చిత్రం ‘చెన్నకేశవరెడ్డి’. శ్రీసాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ ఈ మూవీని నిర్మించారు. 2002 సెప్టెంబర్ 25న ‘చెన్నకేశవరెడ్డి’ ప్రేక్షకుల ముందు విడుదలై అపూర్వ విజయాన్ని సాధించింది.
Bala krishna: ఫ్యాక్షనిజానికి హీరోయిజమ్ జోడించి ప్రేక్షకులను మెప్పించి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లను సాధించిన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలోనే బాలకృష్ణ నటించిన చిత్రం ‘చెన్నకేశవరెడ్డి’. శ్రీసాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ ఈ మూవీని నిర్మించారు. 2002 సెప్టెంబర్ 25న ‘చెన్నకేశవరెడ్డి’ ప్రేక్షకుల ముందు విడుదలై అపూర్వ విజయాన్ని సాధించింది.
బాలకృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో టబు, శ్రియ, దేవయాని, శివకృష్ణ, జయప్రకాశ్ రెడ్డి, ఆనంద్ రాజ్, పృథ్వీ, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, పలువు ప్రముఖ తారాగనం అంతా ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. పరుచూరి బ్రదర్స్ రచనలో మణిశర్మ మ్యూజిక్ మ్యాజిక్ చెయ్యగా, వేటూరి, సీతారామశాస్త్రి, చంద్రబోస్, శ్రీనివాస్ అద్భుతమై పాటలు అందించి ఈ చిత్ర విజయానికి ఎంతో కృషి చేశారు. ఇందులోని పాటలన్నీ వేటికి అవి అద్భుతమనే చెప్పాలి నేటికీ ఆ పాటలకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.
ఇరవై ఏళ్ళ క్రితం తెలుగు చిత్రసీమలో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా ‘చెన్నకేశవ రెడ్డి’ నిలచింది. ఈ యేడాది జూన్ 10న బాలకృష్ణ బర్త్ డేకు ఈ సినిమాను అభిమానులు ప్రత్యేకంగా థియేటర్లలో ప్రదర్శించుకొని ఆనందించారు. అయితే ఈ చిత్రం ఇరవై ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా మరల సెప్టెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తూ ఉండడం విశేషం.
ఇదీ చదవండి: Oke Oka Jeevitham Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న “ఓకే ఒక జీవితం”