Home / Manipur
మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తరలించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు హెల్ప్లైన్లను ఏర్పాటు చేశాయి. మణిపూర్ ప్రభుత్వంతో ఏపీ, తెలంగాణ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు.
Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మరింత చెలరేగుతున్నాయి. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
:మణిపూర్‌లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఎటిఎస్ యుఎం) పిలుపునిచ్చిన గిరిజన సంఘీభావ యాత్ర సందర్భంగా హింస చెలరేగింది. షెడ్యూల్డ్ తెగల కోసం గిరిజనేతర మీటీలు చేస్తున్న డిమాండ్‌కు నిరసనగా ఈ యాత్రను చేపట్టారు. మణిపూర్‌లోని అనేక ప్రభావిత జిల్లాల్లో సైన్యం మరియు అస్సాం రైఫిల్ సిబ్బందిని మోహరించారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మంగళవారం ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పి) హోల్డర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కొత్తగా ప్రారంభించిన సిస్టమ్ ఇన్నర్ లైన్ పర్మిట్ కౌంటర్లలో చెల్లుబాటు గడువు ముగిసిన వారిని సమర్థవంతంగా తనిఖీ చేయడంలో సహాయపడుతుందని అన్నారు.
మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లా న్యూ లమ్కాలో శుక్రవారంముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కార్యక్రమానికి హాజరుకావాల్సిన వేదికను గుంపు ధ్వంసం చేసి, తగులబెట్టడంతో సమావేశాలు నిషేధించబడ్డాయి.మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి.
మణిపూర్ రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార భారతీయ జనతా పార్టీలో విలీనమయ్యారు. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పవచ్చు.