Home / Manipur
మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించే వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో బాధిత మహిళల పిటిషన్ ను విచారించినభారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. మే 4న ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని, 14 రోజుల పాటు పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శనివారం అధికారికంగా విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Manipur Atrocity: మణిపూర్ లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన జరిగిన రోజే మరొక దారుణం జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలో మరో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.
మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు చూపుతున్న వీడియోపై దేశం ఆగ్రహంతో ఊగిపోతుండగా, ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ మెయిటీ ఇంటిని గురువారం కొంతమంది వ్యక్తులు తగులబెట్టారు.మే 3న ఈశాన్య రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్పోక్పి జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటన రెండు నెలల తర్వాత బయటపడింది.
మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై, యూరోపియన్ పార్లమెంట్లో చర్చిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం మండిపడ్డారు. మణిపూర్ పరిస్దితిపై స్పందించని ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో బాస్టిల్ డే పరేడ్ కు వెళ్లారంటూ విమర్శించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన మణిపూర్ పర్యటనలో రెండవరోజు శుక్రవారం మొయిరాంగ్‌కు వెళ్లారు. అక్కడ బాధిత ప్రజలను కలుసుకుని వారి కష్టాలను విన్నారు. మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ , పౌర సమాజ సంస్థ, యునైటెడ్ నాగా కౌన్సిల్ ప్రతినిధులు, మణిపూర్‌లోని నాగా కమ్యూనిటీ అపెక్స్ బాడీ, షెడ్యూల్డ్ తెగల డిమాండ్ కమిటీ మరియు ప్రముఖ వ్యక్తులను కూడా రాహుల్ గాంధీ కలిశారు.
మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపధ్యంలో శాంతిభద్రతలకు మరింత విఘాతం కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్పై నిషేధాన్ని జూన్ 25 వరకు మరో ఐదు రోజులు పొడిగించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అశాంతి దృష్ట్యా డేటా సేవలను నిషేధించిన విషయం తెలిసిందే.
:మణిపూర్‌లోని ఏకైక మహిళా మంత్రి ఇంటికి అల్లరిమూకల గుంపు నిప్పు పెట్టింది.. అయితే ఇంటికి నిప్పు పెట్టినప్పుడు మంత్రి ఇంట్లో ఎవరూ లేరు. రాజకీయ నాయకుడి ఇంటికి నిప్పు పెట్టడం లేదా రాజకీయ నాయకుడి ఆస్తులను ధ్వంసం చేయడానికి సంబంధించిన ఘటనల్లో ఇది రెండవది.
మణిపూర్‌లో తాజాగా జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో పదిమంది గాయపడ్డారు. మైటీల ప్రాబల్యం ఉన్న ఇంఫాల్ తూర్పు జిల్లా మరియు గిరిజనులు అధికంగా ఉండే కాంగ్పోక్పి జిల్లా సరిహద్దుల వెంబడి కాల్పులు జరిగాయి.హింసలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ పై నిషేధాన్ని జూన్ 15 వరకు పొడిగించింది. రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు ఇటీవలి నివేదికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే చిత్రాలు మరియు వీడియోలను ప్రసారం చేయడాన్ని నిషేధించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను పొడిగించింది.