Last Updated:

Manipur Atrocity: మణిపూర్ లో అమానుష ఘటన జరిగిన రోజే మరో దారుణం..

Manipur Atrocity: మణిపూర్ లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన జరిగిన రోజే మరొక దారుణం జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలో మరో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.

Manipur Atrocity: మణిపూర్ లో అమానుష ఘటన జరిగిన రోజే మరో దారుణం..

Manipur Atrocity: మణిపూర్ లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన జరిగిన రోజే మరొక దారుణం జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలో మరో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్ పోక్సి లోని ఒక కార్ వాష్ సెంటర్లో పనిచేసే ఇద్దరు గిరిజన మహిళలపై కొంతమంది వ్యక్తులు దాడిచేసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. వారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఐదుగురు నిందితుల అరెస్ట్..(Manipur Atrocity)

ఇలా ఉండగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో మరో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసారు. అరెస్టయిన వ్యక్తిని యుమ్లెంబమ్ నుంగ్సితోయ్‌గా గుర్తించారు. దీనితో ఈ కేసులో అరెస్టయిన నిందితులు సంఖ్య ఐదుకు చేరింది.షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో మే 3న ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించినప్పుడు రాష్ట్రంలో జాతి హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘర్షణల్లో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరియు అప్పటి నుండి అనేక మంది గాయపడ్డారు.

ఇంఫాల్ లో మహిళల నిరసన..

మరోవైపు మణిపూర్‌లోని ఇంఫాల్‌లో మహిళా నిరసనకారులు ఘరీ ప్రాంతంలోని ప్రధాన రహదారిని ఇరువైపులా దిగ్బంధించి టైర్లను తగులబెట్టారు, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఆందోళనకారులను అణిచివేసేందుకు మణిపూర్ సాయుధ పోలీసులు, ఆర్మీ మరియు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆమంటలను ఆర్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పలు ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు.