Home / latest national news
: పన్ను చెల్లింపుదారులకు మరికొంత సమయాన్ని అందించడానికి, పాన్ మరియు ఆధార్‌ను లింక్ చేయడానికి తేదీ జూన్ 30, 2023 వరకు పొడిగించబడింది, ఆదాయపు పన్ను శాఖ మంగళవారం ఈ విషయాన్ని తెలియజేసింది.జూలై 1, 2023 నుండి, ఆధార్ తో లింక్ చేయని పాన్ కార్డు పనిచేయదు.
ఉత్తరకోరియా సైనికులు మర్చిపోయిన 653 అసాల్ట్ రైఫిల్ బుల్లెట్లను కనుగొనడానికి ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ మొత్తం హైసన్ నగరాన్ని లాక్డౌన్లో ఉంచారు. ఈ నగరంలో 200,000 కంటే ఎక్కువ జనాభా ఉంది.
ప్రయాగ్‌రాజ్ కోర్టు 2007లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యలో ప్రత్యక్ష సాక్షి అయిన ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసుకు సంబంధించి అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ మరియు మరో ఎనిమిది మందినిదోషులుగా నిర్ధారించింది.
పార్టీ జనరల్ కౌన్సిల్ తీర్మానాలు మరియు జనరల్ సెక్రటరీ ఎన్నికలకు వ్యతిరేకంగా ఓ పన్నీర్ సెల్వం (OPS) శిబిరం దాఖలు చేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు తిరస్కరించడంతో ఎడప్పాడి కె పళనిస్వామి (EPS) మంగళవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు
నమీబియా నుంచి గత ఏడాది కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెట్టిన ఎనిమిది చిరుతల్లో ఒకటైన సాషా సోమవారం మరణించింది. ఈ చిరుతకిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. సాషా భారత్‌కు తీసుకురాకముందే అనారోగ్యంతో బాధపడుతోంది.
ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సోమవారం కోరారు. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి లోక్ సభ హౌసింగ్ కమిటీ సోమవారం నోటీసు జారీ చేసింది.సూరత్ కోర్టు పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో శుక్రవారం ఆయన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యారు
Yediyurappa Home: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇంటిపై దాడి జరిగింది. యడ్యూరప్ప ఇంటి వద్ద భారీ ఎత్తున జనాలు గుమిగూడి, ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. సోమవారం మధ్యాహ్నం శివమొగ్గలోని ఆయన నివాసం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం ఇంటి దగ్గర భారీ ఎత్తున జనాలు నిరసన తెలుపుతున్న సన్నివేశాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ నిర్ణయమే కారణమా..(Yediyurappa Home) షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన రిజర్వేషన్లపై ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న […]
సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్బాల్ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థిని ఇస్లామిక్ పవిత్ర గ్రంథం "ఖురాన్"ను చేతితో రాసింది.సలీమా అనే 22 ఏళ్ల కాలేజీ విద్యార్థిని మొదట పవిత్ర గ్రంథాన్ని కంఠస్థం చేసి, ఆపై చేతితో రాసింది.
బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ భార్య రాజశ్రీ యాదవ్ సోమవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తేజస్వి సోదరి రోహిణి ఆచార్య ట్విట్టర్లో తెలిపారు. తమ ఇంటికి ‘లిటిల్ ఏంజెల్’ రూపంలో కొత్త అతిథి వచ్చిందని చెప్పారు.తేజస్వి యాదవ్ నవజాత శిశువుతో ఉన్న చిత్రాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు.
త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జమ్మూ కాశ్మీర్లో నడుస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.ఉధమ్‌పూర్-శ్రీనగర్-బారాముల్లా (యుఎస్‌బిఆర్‌ఎల్) రైలు లింక్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రైలును నడిపిస్తామని అన్నారు