Home / latest national news
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి అక్రమ నిర్మాణాలను సోమవారం బుల్డోజర్లతో కూల్చివేసారు. శ్రీరామనవమి సందర్బంగా ఇక్కడ మెట్ల బావి కూలి 36 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనితో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టేందుకు సోమవారం ఉదయం పెద్దఎత్తున మున్సిపల్, పోలీసు అధికారులు ఆలయానికి చేరుకున్నారు.
యుపిఎ హయాంలో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్‌పై తాజా దాడిలో భారతీయ జనతా పార్టీ ఆదివారం 'కాంగ్రెస్ ఫైల్స్' మొదటి ఎపిసోడ్‌ను విడుదల చేసింది.ఈ వీడియో తొలి ఎపిసోడ్‌ను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.
పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్షిప్ పంపిణీ పేరుతో ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు పది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు రూ.200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయి. పోలీసులు అందించిన సమాచారం మేరకు 18 మందిపై కేసు నమోదు చేశారు
దేశవ్యాప్తంగా గురువారం జరిగిన రామనవమి ఊరేగింపుల్లో పలు చోట్ల హింస, కాల్పులు మరియు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గురువారం చెలరేగిన ఘర్షణలు శుక్రవారం వరకు కొనసాగాయి, అవాంఛనీయ పరిస్థితులను నివారించడానికి పోలీసులు అరెస్టులు చేసి నిషేధాజ్ఞలు విధించారు.
భోపాల్-న్యూఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రైలు ప్రారంభోత్సవానికి ఏప్రిల్ 1న తేదీని నిర్ణయించినట్లు తెలుసుకున్నప్పుడు, కాంగ్రెస్‌లోని 'స్నేహితులు' దానిని ప్రధాని మోదీ ఏప్రిల్ ఫూల్ అని పిలుస్తారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని అన్నారు.
కోల్‌కతాకు చెందిన ఒక వ్యక్తిలో మొక్కల వల్ల సంభవించే ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ యొక్క మొదటి కేసు కనుగొనబడింది. 61 ఏళ్ల, ప్లాంట్ మైకాలజిస్ట్ గొంతు బొంగురుపోవడం, మింగడానికి ఇబ్బంది, గొంతు నొప్పి మరియు మూడు నెలలుగా అలసటతో ఫిర్యాదు చేశారు.
చెన్నై కు చెందిన కళాక్షేత్ర ఫౌండేషన్ అధీనంలోని రుక్మిణీ దేవి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ హరి పద్మన్‌పై చెన్నై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసారు.
పెట్రోలియం కంపెనీలు సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజైన ఏప్రిల్ 1వ తేదీన ఎల్పిజి సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఈ నేపధ్యంలో 2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజున వాణిజ్య గ్యాస్ సిలిండర్ల రేటు దాదాపు రూ.91.50 తగ్గించబడింది
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి ( ఏప్రిల్ 1 ) నుంచి దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజా ఛార్జీలు పెరగనున్నాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. వాహనం స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.49 వరకు టోల్ ఛార్జీలను పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎన్ హచ్ఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళలు మరియు పిల్లలతో సహా కనీసం 11 మంది మరణించగా పలువురు గాయపడ్డారు