Home / latest national news
రోజు రోజుకి పెరుగుతున్న కొవిడ్ కేసులతో దేశంలో మళ్లీ టెన్షన్ మొదలైంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది.
పండుగ పూట మధ్య ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. శ్రీరామ నవమి వేడుకల్లో జరుగుతున్న వేళ ఓ ఆలయంలో..
వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని అలా చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష తప్పదని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సిఆర్) హెచ్చరించింది.,రైళ్లపై రాళ్లు రువ్వడం అనేది క్రిమినల్ నేరమని, రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇది 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
కాపులకో లేఖ అంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య ఓ ఘాటైన లేఖ రాశారు. ఈ సారి పవన్ కళ్యాణ్‌ని గెలిపించుకోలేకపోతే ఇంకెప్పుడూ కాపులకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాదని జోగయ్య హెచ్చరించారు.
భారతదేశంలో చిరుతలు అంతరించిపోయిన దాదాపు 70 సంవత్సరాల తర్వాత, మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నాలుగు చిరుతపిల్లలు జన్మించాయని ప్రభుత్వం ప్రకటించింది. గత సెప్టెంబరులో భారత్‌కు వచ్చిన నమీబియా చిరుతకు ఈ పిల్లలు పుట్టాయి.
కర్ణాటక శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రంలో మే 10న ఎన్నికలు జరగనుండగా ఫలితాలు మే 14న వెలువడనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం పునరుద్ధరించింది. 10 ఏళ్ల జైలు శిక్షతో కూడిన క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో జనవరిలో ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. దీనితో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరగనుంది.
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలో ఎంబీబీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల్లో నమోదు చేసుకోకుండానే MBBS పార్ట్ 1 మరియు పార్ట్ 2 క్లియర్ చేయడానికి విద్యార్థులకు తుది అవకాశం ఇవ్వబడుతుందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది.
నకిలీ మందుల తయారీకి సంబంధించి 18 ఫార్మాస్యూటికల్ కంపెనీల లైసెన్స్‌లను భారత ప్రభుత్వం రద్దు చేసింది.20 రాష్ట్రాల్లోని 76 కంపెనీలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) తనిఖీ చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
లాఫింగ్ గ్యాస్‌గా పిలిచే నైట్రస్ ఆక్సైడ్‌ను ఈ ఏడాది చివరి నాటికి నిషేధించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ గ్యాస్‌ను సి క్లాస్ డ్రగ్‌గా వర్గీకరిస్తారు. దానిని విక్రయించడం మరియు ఉపయోగించడం నేరంగా పరిగణించబడుతుంది,