Home / latest national news
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని పలు స్కూళ్లకు ఈ- మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తీరా స్కూళ్లకు సెలవు ప్రకటించి.. బాంబు కోసం గాలింపు చేపడితే ... అది కేవలం బెదరింపు ఈ మెయిల్ అని తేలింది
లోకసభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టే అవకాశాల్లేవని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖనోజ్లో ఆయన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ర్టలో సుడి గాలి పర్యటన చేస్తున్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం ఉత్తర మహారాష్ర్ట లోని నందుర్బార్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. శుక్రవారం అయోధ్యలో భక్తులు సరయూ నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా దేశంలోని హిందువులు, జైనులు అక్షయ తృతీయ రోజును అత్యంత పవిత్ర దినంగా భావిస్తున్నారు. అక్షయ తృతీయ సందర్బంగా బంగారం కొంటే అదృష్ట కలిసి వస్తుందని నమ్మకం భారతీయుల్లో ఉంటుంది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకె ) ఇండియలో అంతర్భాగమని కేంద్ర విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్ మరోసారి స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కలసి రావాలని కోరారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత .. ప్రజల మదిలో తిరిగి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన రెకెత్తించిందని జై శంకర్ న్యూఢిల్లీలో గార్గి కాలేజీ విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడుతూ అన్నారు
మండుటెండలతో విసిగిపోయిన దేశ ప్రజలకు శుభవార్త! త్వరలోనే దేశవ్యాప్తంగా ఎండలు తగ్గనున్నాయి. పశ్చిమ రాజస్థాన్, కేరళ తప్పించి యావత్ దేశంలో వేసవి ఎండలు తగ్గముఖం పడుతాయని భారత వాతావరణ శాఖ గురువారం నాడు వెల్లడించింది. కాగా శుక్రవారం పశ్చిమ రాజస్థాన్‌లో వేడిగాడ్పులు వీస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సైంటిస్టు సోమాసేన్ తెలిపారు.
ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేపుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని కర్ణాటక కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్న విదేశాల్లో తలదాచుకున్నాడని.. ఆయనను బెంగళూరుకు రప్పించేందుకు బ్లూకార్నర్ నోటీసు జారీ చేశామని... దీంతో పాటు ఇంటర్‌పోల్ సాయం కూడా తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నాడు తెలంగాణ పర్యటనలో రాహుల్‌గాంధీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రోజు అదానీ.. అంబానీ.. అంబానీ..అదానీ అంటూ విమర్శించే రాహుల్ ప్రస్తుతం ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆయనకు కూడా వీరి నుంచి టెంపోల్లో నోట్ల కట్టలు ముట్టినందుకు మౌనం పాటిస్తున్నారా అని నిలదీశారు
టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా విమానాలు మంగళవారం రాత్రి నుంచి సుమారు వంద విమానాల వరకు రద్దు అయ్యాయి. పైలెట్లతో పాటు ఇతర సిబ్బంది సిక్ లీవ్ పెట్టడంతో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దు చేయాల్సివచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు నిలబడి పోవాల్సి వచ్చింది.
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నుండి ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చంది. ఇక్కడ యువత ఫ్లేవర్ కండోమ్‌లకు అలవాటు పడుతున్నారు, యువత పెద్ద ఎత్తున ఫ్లేవర్‌తో కూడిన కండోమ్‌లను కొనుగోలు చేసి వాటితో మత్తులో మునుగుతున్నారు