Home / latest national news
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపక ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చెల్లుబాటు కాదని.. తక్షణమే విడుదల చేయాలని బుధవారం నాడు సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం జడ్జిలు బీఆర్ గవాయి, సందీప్ మెహతాలతో కూడిన న్యూస్ క్లిక్ ఎడిటర్ అరెస్టుకు సంబంధించి రిమాండ్ కాపీ తమకు అందజేయలేదని, కాబట్టి ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్వీ అశోకన్ క్షమాపణల పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా అశోకన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోర్టుకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.
OTT Platform:కేంద్రప్రభుత్వం వచ్చే ఆగస్టు నాటికి వీటికి పోటీగా సొంత ఒటీటీ ఫ్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం దీని బాద్యతను పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌క్యాస్టర్ ప్రసారభారతికి అప్పగించింది. ప్రసార భారతి దేశీయ ఓటిటికి రంగం సిద్దం చేస్తోంది. దేశీయ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌తో పాటు హాట్‌స్టార్‌కు పోటీ ఇవ్వబోతోంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రమోట్ చేస్తుంది. ఆగస్టులో అందుబాటులోకి వచ్చే ఓటీటీ ప్రారంభంలో ఒకటి, రెండు సంవత్సరాల పాటు ఉచితంగా […]
దొంగలు మామూలు బస్సులు, రైలు ప్రయాణాల్లోనే కాదు... విమానాల్లో కూడా ఉంటారని తాజా సంఘటన రుజువు చేస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏడాదికి 200 సార్లు విమానాల్లో ప్రయాణించి ప్రయాణికుల ఖరీదైన వస్తువులు కొట్టేసేవాడు.
ముంబైలో హోర్డింగ్ జారిపడిన ఘటనలో 14 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలోని పెట్రోల్ పంపు పక్కన ఉన్న 100 అడుగుల హోర్డింగ్ తుఫాను గాలులకు కిందకు పడిపోవడంతో దీనికింద ఉన్న కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కార్లలో పలువురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్ తనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన అనుచరుడు దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీ పోలీసులకు సోమవార ఉదయం ఓ కాల్ వచ్చింది. ఆ కాల్లో ఆమ్ఆద్మీపార్టీకి చెందిన నాయకురాలు, రాజ్యసభ ఎంపీ స్వాతిమలీవాల్పై దాడి జరిగిందని సమాచారం ఇచ్చారు
నాలుగవ విడత లోకసభ ఎన్నికల ఓటింగ్ క్రమంగా జోరుందుకుంటోంది. మొత్తం తొమ్మిది రాష్ర్టాల్లో ఒక కేంద్ర ప్రాలిత ప్రాంతంతో సహా మొత్తం 96 నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటల వరకు చూస్తే ఓటింగ్ 24.87 శాతంగా నమోదైందని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.
బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి మధ్య మాటల యుద్ధం ముగిసేట్లు కనిపించడం లేదు. కాగా శనివారం నాడు నవనీత్ రాణా మరోమారు ఓవైసీని ఉద్దేశించి కొత్త వీడియోను విడుదల చేశారు. దేశంలోని ప్రతి గల్లిలో రామభక్తులు తిరుగుతున్నారని గుర్తు చేశారు
దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ పీక్కు చేరుకుంది. సోమవారం నాడు మూడవ విడత పోలింగ్ జరుగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీపై ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు. కాగా శనివారం నాడు ఆయన కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌తో పాటు ఢిల్లీ మంత్రి అతిషి వెంట వచ్చారు.