Home / latest national news
UPSC Exam: ఈ పరీక్షకు ఎంపికై.. చివర్లో అడ్డంకి ఏర్పడితే ఆ బాధ వర్ణనాతీతం. మధ్యప్రదేశ్‌లోని ఇద్దరు మహిళా అభ్యర్థులకు సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది.
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మొదటి పిల్ల మరణించిన కొన్ని రోజుల తర్వాత, జ్వాల మరో రెండు చిరుత పిల్లలు గురువారం మరణించాయి. జ్వాల మార్చి 24న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.కొత్తగా పుట్టిన మూడు చిరుతలు చనిపోగా, నాల్గవది అతని ఆరోగ్యం విషమంగా ఉన్నందున పరిశీలనలో ఉంచబడింది.
రెండువేల రూపాయల కరెన్సీ నోటును లీగల్ టెండర్‌గా ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన తర్వాత, రవాణా ఇంధనం, బంగారం మరియు వెండి ఆభరణాల కొనుగోలు పెరిగినట్లు నివేదికలు వచ్చాయి. అయితే, 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో మాదిరి ఎలాంటి భయాందోళనలు కనిపించలేదు.
ఢిల్లీలోని సైకో కిల్లర్ రవీంద్ర కుమార్‌కు దేశ రాజధానిలోని రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. 30 మందికి పైగా మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో గురువారం కోర్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించింది.
భారత రాష్ట్రపతిచే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేలా లోక్‌సభ సెక్రటేరియట్ మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని తీసుకున్న విపక్షాల నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విరుచుకుపడ్డారు.జపాన్, పపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాలో మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని గురువారం ఢిల్లీ చేరుకున్నారు.
కర్నాటక ఎన్నికల ముందు అమూల్ వర్సెస్ నందిని వివాదరం రేగిన కొద్ది రోజుల తర్వాత, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర సహకార సంస్థ అయిన ఆవిన్ పాల సమాఖ్య నుంచి అమూల్ పాలను సేకరించకుండా ఆపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాంచీలో సుమారు రూ550 కోట్లతో నిర్మించిన జార్ఖండ్ హైకోర్టు కొత్త భవనాన్ని ప్రారంభించారు. సుమారుగా 165 ఎకరాలల్లో ఉన్న కొత్త హైకోర్టు విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్దది.
: ఆమ్నెస్టీ ఇండియా నిషేధాన్ని రద్దు చేయాలని కోరడంతో విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని పరిశీలిస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో గంజాయి నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని ఒడిశా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలోని ఏ శివాలయంలోనూ గంజాయిని ఏ రూపంలోనూ ఉపయోగించరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.