Home / latest ap news
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మే 10 వ తేదీన (బుధవారం) పవన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్టుగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నట్టుగా తెలుస్తుంది.
అల్లూరి వీరమరణం పొంది నేటికి వందేళ్లు అయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజుకి భారతరత్న ప్రకటించాలని పవన్ డిమాండ్ చేశారు. అల్లూరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు.
పార్టీ కోసం తాను చాలా శ్రమించానని ఎన్నో బాధలు పడ్డానని అయితే నిందలు, అవమానాలు భరించలేకపోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు
అమరావతి R5 జోన్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. R5 జోన్‌పై రైతుల పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. R5 జోన్ లో ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించటంపై జారీ చేసిన జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు పిటిషన్ వేశారు. అయితే.. జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
భోగాపురం ఎయిర్‌పోర్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. టీడీపీ నేతలు కడుపు మంటతో మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఎయిర్‌పోర్టును తీసుకొస్తే టీడీపీ నేతలకు ఏడుపెందుకని విమర్శించారు. ఎయిర్‌పోర్టును మూడేళ్లలో పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామని రైతులతో సంప్రదింపుల తర్వాతే భూసేకరణ చేశామని తెలిపారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమగోదారి జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం తరపున దెబ్బతిన్న పంటలను చూసేందుకు ఎవరూ రాలేదని రైతులు ఆవేదనతో ఆయనకు చెప్పుకున్నారు.
అమరావతి భూముల కుంభకోణంపై సిట్ విచారణ కొనసాగించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. సిట్ దర్యాప్తు ప్రాసెస్‌లో ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని, అన్ని కోణాల్లో విచారించి కేసుని తేల్చమని కూడా హైకోర్టు సూచించిందని చంద్రబాబు తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ వైజాగ్, విజయనగరం జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా లైవ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైజాగ్, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. కాగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల నేటితో సాకారం కాబోతోంది.
Posters In AP : ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు రావడం కలకలం రేపుతుంది. ఒక వైపు విజయవాడలో కార్మికులను రోడ్డున పడేసిన చరిత్ర వైసీపీదే అంటూ పోస్టర్లు వేశారు. మరోవైపు రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం-సుస్వాగతం అంటూ విశాఖలో ఏర్పాటుచేసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 3న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ రాజధాని లేని […]