Home / latest ap news
టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు అయింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కర్నూలు కోర్టు కొట్టేసింది. సాయంత్రం కర్నూలు జైలు నుంచి అఖిలప్రియ విడుదలకానున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అఖిలప్రియ దంపతులు అరెస్ట్ అయ్యారు.
నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమ చేశారు. అలానే బహిరంగ సభలో మాట్లాడుతున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఊహించని విధంగా ఉందని చెప్పాలి. ఒక వైపు నిప్పుల కొలిమిలా మండుతూనే మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు ప్రతాపం చూపిస్తున్న తరుణంలో వాతావరణశాఖ చల్లటి కబురు ప్రకటించింది. ఇవాళ, రేపట్లో.. నైరుతి రుతుపవనాలు దక్షిణ
ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్ 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ ని తాజాగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా మే 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఇటీవలే వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు..
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు తాజాగా విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ లతో కూడిన ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయాలని ఆదేశించింది. ఈ నెల 25న విచారణ జరపాలని..
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. మచిలీపట్నం (బందరు) తపసిపూడి గ్రామంలో పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారా లేక హత్యకు గురయ్యారా అన్నది ఆ రోజు తనకి తెలియదని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం చెప్పారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన అజయ్ కల్లాం వైఎస్ వివేకా మరణించారని మాత్రమే ప్రస్తుత సిఎం జగన్ అప్పుడు తమకి చెప్పారని తెలిపారు.
అమరావతిలోని ఆర్ 5 జోన్లో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వోచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ హైకోర్టు తుది తీర్పుకు కట్టుబడే ఉండాలన్న అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.
ఏపీలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు భయపడి ప్రజలు ఉదయం 8 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అలానే ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో తడిసిపోతున్నారు. ఈ వేసవి ప్రకోపానికి ముఖ్యంగా వృద్ధులు, రైతులు, కూలీలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా తాజాగా అందిన
ఆంధ్రప్రదేశ్ లోని లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ ఘటనలో ఐదుగురు కూలీలు మరణించగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరగగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు.