Home / Karnataka
:కర్ణాటక రాష్ట్రంలో అమూల్ ప్రవేశం రాజకీయ వేడిని రగిలించింది. స్థానిక ప్రఖ్యాత పాల బ్రాండ్ నందిని ని రక్షించుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీలు పిలుపు నిచ్చాయి. ఒక పధకం ప్రకారం ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ను దెబ్బతీసేందుకే అమూల్ ను తీసుకు వచ్చిందంటూ ఆరోపిస్తున్నాయి.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడి ఇళ్ల యజమానులకు తమ ఆదాయంలో.. ఎక్కువ అద్దెల నుంచే వస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
కర్ణాటక శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రంలో మే 10న ఎన్నికలు జరగనుండగా ఫలితాలు మే 14న వెలువడనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
Yediyurappa Home: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇంటిపై దాడి జరిగింది. యడ్యూరప్ప ఇంటి వద్ద భారీ ఎత్తున జనాలు గుమిగూడి, ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. సోమవారం మధ్యాహ్నం శివమొగ్గలోని ఆయన నివాసం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం ఇంటి దగ్గర భారీ ఎత్తున జనాలు నిరసన తెలుపుతున్న సన్నివేశాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ నిర్ణయమే కారణమా..(Yediyurappa Home) షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన రిజర్వేషన్లపై ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న […]
కర్ణాటక ఎన్నికలకు ముందు టిప్పు సుల్తాన్‌కు సంబంధించిన మరో అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. టిప్పు సుల్తాన్ హంతకులపై సినిమా నిర్మించేందుకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కెఎఫ్‌సిసి)తో చర్చలు జరుపుతున్నట్లు అధికార బీజేపీ ప్రకటించింది
కర్ణాటక భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే కెఎస్ ఈశ్వరప్ప మసీదుల్లో ఇచ్చే అజాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆజాన్ సమయంలో లౌడ్ స్పీకర్లను ఉపయోగిస్తేనే మాత్రమే అల్లా ప్రార్థనలు వింటారా అని ప్రశ్నించారు. జేపీ 'విజయ్ సంకల్ప్ యాత్ర'లో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఈశ్వరప్ప ఆజాన్‌ను తలనొప్పిగా అభివర్ణించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది.
వైరస్ కారణంగా అనేక మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని, దీంతో హాస్పిటల్ లో చేరడం అనివార్యమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది.
Bride: కొద్ది రోజుల్లో పెళ్లి.. పెళ్లవ్వగానే అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన నవ వధువుకు ఊహించని షాక్ తగిలింది. పెళ్లి కోసం వేసుకున్న మేకప్ పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. అందంగా ఉండాలని ప్రయత్నించి చివరికి.. ఆసుపత్రిపాలైంది. దీంతో వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు.
Karnataka MLA: కర్ణాటక లంచం కేసు.. ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే భాజపా ఎమ్మెల్యే కుమారుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతో ఎమ్మెల్యే పాత్రపైనా పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. భాజపా తనయుడి ఇంట్లో సుమారు రూ.8కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.