Home / Karnataka
కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ బాగా పోరాడాలని అన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత తాను సంతోషంగా లేనని అన్నారు.
Rahul Gandhi: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు.. మెుదటి క్యాబినెట్ సమావేశంలో చట్టాలుగా మారనున్నాయని రాహుల్ అన్నారు.
కర్ణాటక రాష్ట్ర 24 వ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోకి కంఠీరవ స్టేడియంలో రెండో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Karnataka New CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో కర్ణాటకలోని చిత్రదుర్గ గ్రామస్థులు విద్యుత్ బిల్లులు చెల్లించడంలేదని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా సోమవారం తెలిపారు. దీనికి సంబంధించి మాల్వియా ఒక వీడియోను పంచుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్త సీఎం ఎంపికలో కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది, ఆ రాష్ట్ర పీసీపీ చీఫ్ డికె శివకుమార్ మరియు సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య ఇద్దరూ ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయం నమోదు చేసిన తర్వాత, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నియమించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు పార్టీ ఆదివారం ముగ్గురు పరిశీలకులను నియమించింది. ప్రభుత్వ ఏర్పాటు, రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిపై చర్చించేందుకు బెంగళూరులో కాంగ్రెస్ నేడు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రంగంలోకి పలు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించినప్పటికీ బీజేపీ పరాజయాన్ని ఆపలేకపోయారు
రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు దాదాపు మూడు గంటల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసీఐ అధికారిక సమాచారం ప్రకారం ఉదయం 11 గంటల సమయానికి సాధారణ మెజారిటీ 113 స్థానాల్లో ఉన్న శాసనసభలో కాంగ్రెస్ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Karnataka Election Result: కర్ణాటక రాష్ట్రంలో ఫలితాలపై ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తుంది.