Home / Janasena
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చిన ఏపీ మహిళా కమీషన్ కు పలు పార్టీల నేతల నుండి నిరసనలు గుప్పుమంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు నోటీసులు పంపించారు సరే, వైకాపా నేతల పట్ల మహిళా కమీషన్ ప్రవర్తిస్తున్న తీరును తెదేపా నేత వర్ల రామయ్య సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలోని మహిళా కమీషన్ బాధ్యతలు ఎంతమేరకు నిర్వహిస్తున్నారో ఆ పార్టీ గుర్తు చేసింది. ఓ పార్టీకి కొమ్ముకాసేలా రాష్ట్ర మహిళా కమీషన్ వ్యవహారిస్తున్న తీరును సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ఎండగట్టింది.
తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇష్టం ఉన్నవాళ్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది.
మేమే శాశ్వతం, మాదే రాజ్యం అనే ధోరణిలో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారని, అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడు కొణిదెల నాగబాబు హెచ్చరించారు.
ఏపీలో పోలీసులు ప్రభుత్వ పోలిసింగ్ గా మారారని ఆరోపిస్తున్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను నిజమేనని అనుకొనేలా కొన్ని సంఘటనలు అద్దం పడుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారు.
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చంద్రబాబు, పవన్ కలయిక పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ను చంద్రబాబు కలవడాన్ని స్వాగతిస్తున్నానన్నారు.
జగన్ మంత్రివర్గంలోని కొంతమంది మంత్రులు ప్యాకేజీలతో పాలన చేస్తున్నారని దెందలూరు జనసేన నాయకురాలు డాక్టర్ వెంకటలక్ష్మీ గంటసాల పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మరొక్కసారి ప్యాకేజి పవన్ కల్యాణ్ అంటే ఒప్పుకోమని ఆమె హెచ్చరించారు.
ఏపీలో గత నాలుగు రోజులుగా చోటుచేసుకొన్న జనసేన పరిణామాలను అధిష్టానంకు వివరించేందుకు భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ చేరుకొన్నారు. భాజన నేత శివ ప్రకాష్ జీకి వివరించారు.