Home / IT raids
బీజేపీ మమ్మల్నే కాదు కేసీఆర్ ను కూడా ఏమీ చేయలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం బోయిన్ పల్లిలోని తన నివాసంలో మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.
తాను ఇంట్లో లేని సమయంలో ఐటీ అధికారులు తన కుటుంబసభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా 400 మందికి పైగా ఐటీ అధికారులు 65 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. అయితే మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం నాడు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఐటీ శాఖ మెరుపుదాడులు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై తెల్లవారు జామునుంచే ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడి ఇంట్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
జార్ఖండ్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వారి సహచరులపై దాడి చేసిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ రూ. 100 కోట్లకు పైగా లెక్కచూపని లావాదేవీలు మరియు పెట్టుబడులను గుర్తించింది.
మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదు దొరికినట్టుగా వార్తలు వినవస్తున్నాయి. రాత్రి నల్లగొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని సాంబశివరావు నివాసంతో పాటు, హైదరాబాద్, నెల్లూర్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఆదాయపు పన్ను శాఖ కోల్కతాకు చెందిన ప్రముఖ బిజినెస్ గ్రూప్ పై సోదాలు మరియు జప్తు ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్బంగా లెక్కల్లో చూపని రూ. 250 కోట్లు ఆదాయాన్ని గుర్తించింది.
హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫీనిక్స్ ఛైర్మన్లు, డైరక్టర్ల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తుంది ఫీనిక్స్ సంస్థ.