Home / IT raids
IT Rides Again: హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ మరోసారి కలకలం రేపుతున్నాయి. ఈ సారి దాదాపు 30 టీమ్ లు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. ఇటీవల వరుసగా హైదరాబాద్ లో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోసారి ఈ దాడుల నేపథ్యంలో ప్రముఖులు అప్రమత్తం అవుతున్నారు. ఉన్నట్టుండి ఐటీ అధికారులు భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖులే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పేరుమోసిన వ్యాపరవేత్త కార్యాలయాల్లో ఉదయం […]
ఆదాయపు పన్ను శాఖ పశ్చిమబెంగాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన దాడుల సందర్బంగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ నివాసంలో రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది
హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.హైదరాబాద్లో ప్రముఖ బిల్డర్ వంశీరామ్ బిల్డర్స్ ఎండీ సుబ్బారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు రెండవరోజు కూడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు
తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి తమ ముందు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ విచారణకు ఆయన దూరంగా ఉన్నారు.
బీజేపీ మమ్మల్నే కాదు కేసీఆర్ ను కూడా ఏమీ చేయలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం బోయిన్ పల్లిలోని తన నివాసంలో మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.
తాను ఇంట్లో లేని సమయంలో ఐటీ అధికారులు తన కుటుంబసభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా 400 మందికి పైగా ఐటీ అధికారులు 65 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. అయితే మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం నాడు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఐటీ శాఖ మెరుపుదాడులు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై తెల్లవారు జామునుంచే ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడి ఇంట్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.