Home / International News
ఆర్థిక శాస్త్రాలలో ఈ సంవత్సరం నోబెల్ బహుమతి US ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్ బెన్ S. బెర్నాంకే మరియు ఇద్దరు U.S. ఆధారిత ఆర్థికవేత్తలు డగ్లస్ W. డైమండ్ మరియు ఫిలిప్ H. డైబ్విగ్లకు ప్రకటించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సుప్రసిద్ధ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్‌కి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వీసా మంజూరు చేసింది.
కుక్కని పోలిన జంతువు నక్క. అయితే చిన్నపిల్లగా ఉన్నప్పుడు నక్క పిల్లకి, కుక్క పిల్లకి పెద్దగా తేడా తెలియదు. అలా ఓ ఫ్యామిలీ కుక్క అనుకుని పెంచుకున్నారు. తీరా చూస్తే అది నక్క అని తెలియడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఖంగుతినింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇలాంటి ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా..
రష్యా, ఉక్రెయిన్ దేశాల మద్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో మరో కీలకం చోటుచేసుకొనింది. గడిచిన 8 నెలలుగా సాగుతున్న యుద్దం నేపధ్యంలో నేడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై భీకర బాంబు దాడులు చోటుచేసుకొన్నాయి. అత్యంత కీలక దాడులుగా ఉక్రెయిన్ దేశం ప్రకటించింది
ఇటీవలె కురుస్తున్న భారీ వర్షాల ధాటికి పలు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. వరదలు వచ్చి నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. దీనితో నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. నైగర్ నదికి ఒక్కసారిగా వరద ప్రహవాం పోటెత్తడంతో బగ్‌బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దానితో 76 మంది నీటిలో మునిగి మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి కొన్ని దేశాలు అల్లాడుతున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాను భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని కారకాస్‌కు సమీపంలోని లాస్ టెజెరస్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో 22 మంది మృతి చెందగా మరో 52 మంది గల్లంతయ్యారు.
కొన్ని రాత్రులను మరవలేము. ఈ రాత్రంతా ఇలానే ఉంటే ఎంత బాగుండో అని ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటాం కాదా. కొన్ని నెలల పాటు అసలు సూర్యుడు ఉదయించని ప్రాంతాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా. నిజమేనండి ఆ ఊర్లల్లో శీతాకాలంలో కొద్ది రోజుల పాటు సూర్యుడు ఉదయించని రోజులు ఉంటాయంట వాటిని పోలార్ నైట్స్ అంటారు అలా సుదీర్ఘంగా రాత్రిగానే ఉండే ఊర్లేంటో తెలుసుకుందామా.
మెక్సోకో దేశంలో వరుసగా మూడోసారి విద్యార్థులపై విషప్రయోగం జరిగింది. దక్షిణ మెక్సికో రాష్ట్రమైన చియాపాస్ లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో చదువుతున్న 57 మంది విద్యార్థులపై గుర్తుతెలియని పదార్థంతో విషప్రయోగం చేశారు.
ఇటీవలి కాలంలో న్యూయార్కు నగరంలోకి వేలాది మంది అక్రమ వలసదార్లు పొటెత్తడంతో న్యూయార్కు మేయర్ ఎరిక్ ఆడమ్స్ నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించారు.
హిందూ దేవాలయాలపై గత కొన్ని రోజులుగా వివిధ దేశాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని పురాతన హిందూ దేవాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆలయంలోని దేవతా విగ్రహాన్ని ధ్వసం చేశారు. ఈ ఘటన ఇప్పుడు ఆ దేశమంతటా కలకలం సృష్టిస్తోంది.