Home / International News
రాజకీయ, ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ లో పరిస్ధితులు తారస్థాయికి చేరుకోన్నాయి. దీంతో బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రిటన్ లో అతి తక్కువ రోజులు పాలన చేసిన ప్రధానిగా ట్రస్ రికార్డుకెక్కారు. ఆమె కేవలం 44 రోజులే పదవిలో కొనసాగగలిగారు.
మలేషియాలో ఎన్నకల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ వచ్చే నెల 19న జాతీయ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది.
పాకిస్తాన్లో మైనారిటీ హిందూ, సిక్కుల బాలికలకు భద్రత లేకుండా పోతోంది. మైనారిటి కూడా తీరని బాలికలను వారి ఇంటి నుంచే బలవంతంగా ఎత్తుకుపోయి.. మతం మార్పిడి చేయించి బాలికలకంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ వయసు ఉన్న వారితో పెళ్లిళ్లు చేయించడం సర్వసాధారణంగా మారిపోయింది.
యునైటెడ్ కింగ్ డమ్ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. యూకేకు లిజ్ ట్రస్ ప్రధాని అయిన తర్వాత అక్కడ విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయడంతో రానున్న కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచానా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ వాసులు ఖర్చులను తగ్గించుకునేందుకు భోజనాలను తగ్గించుకుంచుకోవడం గమనార్షం.
ఖాట్మాండ్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. నేపాల్-చైనా సరిహద్దులోని సింధుపాల్ చౌక్ జిల్లాలో మద్యాహ్నం 2.52గంటలకు ఈ భూకంపం చోటుచేసుకొనింది. నేపాల్ కు 53 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగిన్నట్లు తెలుస్తుంది.
న్యూయార్క్ నగరంలో ఒక వ్యక్తి తాను ఆర్డర్ ఇచ్చిన చికెన్ బిర్యానీ ఇవ్వకపోవడంతో రెస్టారెంట్ కు నిప్పు పెట్టాడు.
అమెరికా అంతర్జాతీయ విమాన సర్వీసులో అందులోనూ బిజినెస్ క్లాస్ ప్రయాణికులను అనుకోని అతిథి బెంబేలెత్తించింది. ఫ్లోరిడాలోని న్యూజెర్సీకి బయలు దేరిన యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులకు పాము కనిపించింది. దీనితో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
శ్రీలంక నవలా రచయిత షెహన్ కరుణతిలక తన ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మెయిడా పుస్తకానికి బుకర్ బహుమతిని గెలుచుకున్నారు.
పోర్చుగల్ అజోర్స్ ద్వీపసమూహంలోని ఫైయల్ ద్వీపంలో అతిపెద్దదైన చనిపోయినసన్ ఫిష్ ను ఇటీవల కనుగొన్నారు. సముద్ర శాస్త్రవేత్తలు దీనిని ప్రపంచంలోనే అత్యంత బరువైన చేపగా పేర్కొన్నారు.
రష్యా సైనిక స్దావరంపై జరిగిన ఉగ్రదాడిలో కనీసం 11 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.