Home / International News
స్టేడియంలోనే 129 మంది మృతి చెందారు. దాదాపు మరో 180 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్ బాల్ మైదానంలో ఇరుజట్ల ఫ్యాన్స్ మధ్య తీవ్ర రణరంగం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన ఇండోనేషియాలోని ఈస్ట్ జావాలో చోటుచేసుకుంది.
ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా నగరంలో శుక్రవారం పౌర కాన్వాయ్‌పై రష్యా క్షిపణి దాడి చేయడంతో కనీసం 30 మంది మరణించగా 88 మంది గాయపడ్డారు.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తన క్యాబిన్ సిబ్బందిని అండర్ వేర్లు ధరించాలని' కోరుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎయిర్‌లైన్స్ ఎయిర్ హోస్టెస్‌ల డ్రెస్సింగ్ పై పాకిస్థాన్ జాతీయ క్యారియర్ ఫ్లైట్ జనరల్ మేనేజర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారని, ఆ తర్వాత మార్గదర్శకాలు జారీ చేశారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.
కాబూల్‌లోని ఒక విద్యా కేంద్రంలో ఆత్మాహుతి బాంబు దాడిలో మృతుల సంఖ్య 100 కు చేరింది. స్థానిక జర్నలిస్టు చెప్పిన వివరాల ప్రకారం, ఈ సంఘటనలో విద్యార్థులు ఎక్కువగా హజారాలు మరియు షియాలు మరణించారు.
అమెరికాలో ఉంటూ ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న 80 లక్షల మందికి శుభవార్త. వీరికి శాశ్వత నివాస హోదా కల్పించే కార్డును మంజూరు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల బృందం సెనేట్‌లో ప్రవేశపెట్టింది.
యమజాకి 55 జపాన్‌లో ఇప్పటివరకు బాటిల్లో ఉంచబడిన పురాతన మరియు అత్యంత విలువైన విస్కీ. యమజాకి 55 జపాన్‌లో ఇప్పటివరకు బాటిల్లో ఉంచబడిన పురాతన మరియు అత్యంత విలువైన విస్కీ. ఈ సంవత్సరం 750 ml విస్కీ వేలంలో $8,00,000 (దాదాపు రూ. 65.2 కోట్లు)కి విక్రయించబడింది. ఈ విస్కీ ఒక్క షాట్ ధర దాదాపు రూ. 4.7 కోట్లు.
పాకిస్ధాన్ లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి 6గురు వ్యక్తులు దుర్మరణం పాలైన్నట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. చనిపోయిన వారిలో ఇద్దరు ఆర్మీ మేజర్లు (పైలట్లు) ఉన్నట్లు తెలిపింది.
ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జియార్జియా మెలోని బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. నేషనలిస్ట్ బ్రదర్స్ పార్టీ నేత అయిన మెలోని, ఆదివారం జరిగిన జాతీయ ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడించాయి.
సెంట్రల్ రష్యాలోని ఓ పాఠశాలపై సోమవారం ఉదయం ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు విద్యార్థులు సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని ఉద్ముర్తియా ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచాలోవ్ ఓ వీడియో ద్వారా ప్రకటించారు
ఉక్రెయిన్‌తో యుద్ధంలో కొన్నాళ్లుగా రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మెరుపు దాడులతో ఉక్రెయిన్ దళాలు మాస్కో సేనలను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.