Home / Enforcement Directorate
MLC Kavitha: ఈడీ విచారణలో భాగంగా.. కవిత దిల్లీ బయల్దేరి వెళ్లారు. దీంతో రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ కవితతో పాటు.. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా వెళ్లారు. దీంతో రేపు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 9 గంటలపాటు కవితను అధికారులు ప్రశ్నించారు. ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు.
ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని తేజస్వి యాదవ్ బంగ్లాను కేవలం రూ. 4 లక్షలకు కొనుగోలు చేశారని, దాని మార్కెట్ ధర ఇప్పుడు రూ. 150 కోట్లు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. AB ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ చేయబడిన ఈ నాలుగు అంతస్తుల బంగ్లా, తేజస్వి యాదవ్ మరియు కుటుంబ సభ్యుల యాజమాన్యం మరియు నియంత్రణలో ఉందని ఏజెన్సీ తెలిపింది.
MLC Kavitha: ఉదయం నుంచి కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. దీంతో ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు.. అక్కడి నుంచి బయటకు పంపేస్తున్నారు. దాదాపు 8 గంటలుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన తాజా పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త మరియు కేసులో నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్లై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన వాంగ్మూలాలను ఫోర్జరీ చేసి, వాటిపై సంతకం చేయమని బలవంతం చేసిందని ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది. ఇదే కేసులో సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడంతో ఇప్పటికే ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్సమెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సెక్రటరీ కి ఈడీ సమన్లు జారీ చేసింది.
Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో ప్రముఖల పేర్లను ప్రస్తావించింది. ఇందులో ముఖ్యంగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేర్లను ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ఎంజిఎం మారన్ మరియు ఎంజిఎం ఆనంద్ మరియు వారి సంస్థ-సదరన్ అగ్రిఫ్యూరాన్ ఇండస్ట్రీస్ యొక్క రూ. 205.36 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది.
మనీలాండరింగ్ కేసులో మే నెలలో అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ జైలులో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదివారం ప్రత్యేక కోర్టుకు తెలిపింది.