Last Updated:

MLC Kavitha: దిల్లీకి బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత.. కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా!

MLC Kavitha: ఈడీ విచారణలో భాగంగా.. కవిత దిల్లీ బయల్దేరి వెళ్లారు. దీంతో రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ కవితతో పాటు.. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా వెళ్లారు. దీంతో రేపు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

MLC Kavitha: దిల్లీకి బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత.. కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా!

MLC Kavitha: ఈడీ విచారణలో భాగంగా.. కవిత దిల్లీ బయల్దేరి వెళ్లారు. దీంతో రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ కవితతో పాటు.. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా వెళ్లారు. దీంతో రేపు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ప్రత్యేక విమానంలో.. (MLC Kavitha)

భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీకి బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. కవితతో పాటు.. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా వెళ్లారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది.

ఈ వ్యవహారంపై.. ఇది వరకే ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ ఈడీ తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని తెలిపారని.. అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీజేఐ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, తక్షణమే విచారించేందుకు నిరాకరించింది. ముందు చెప్పిన విధంగానే ఈనెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటంతో ఈనెల 16న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. దీంతో సుప్రీం తీర్పునకు ముందే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

మరోసారి నోటీసులు

ఈ నెల 20వ తేదీన కవిత విచారణకు హాజరు కావాలని తాజా నోటీసుల్లో పేర్కొంది. దీంతో, ఈడీ నోటీసులపై మరోసారి ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈనెల 24 వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరగనుంది.

అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ కవిత అనుకోని ట్విస్ట్ ఇచ్చారు.

ఈడీ కోరిన సమాచారాన్ని సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌తో ఈడీ అడిగిన సమాచారాన్ని పంపించారు.

ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత పేర్కొన్నారు.

ఈ మేరకు ఈడీకి కవిత 6 పేజీల లేఖ రాశారు.

ఈడీ వేధిస్తోంది: కవిత లాయర్‌

ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారులు అన్యాయంగా కేసులుపెట్టి వేధిస్తున్నారని ఆమె తరఫు న్యాయవాది భరత్‌ అన్నారు.

అనారోగ్యం అని అసత్యప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మహిళను ఇంటి వద్దే విచారించాలని తెలిపారు.

విచారణకు మళ్లీ ఎప్పుడు రావాలో ఈడీ చెప్పలేదన్నారు.

కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్‌ ఈ నెల 24న విచారణకు రానుందన్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తదుపరి ఆదేశాల ప్రకారమే తాము ముందుకెళ్తామని స్పష్టంచేశారు.