Last Updated:

Excise Policy Scam: లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ సెక్రటరీని ప్రశ్నించిన ఈడీ

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్సమెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సెక్రటరీ కి ఈడీ సమన్లు జారీ చేసింది.

Excise Policy Scam: లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ సెక్రటరీని ప్రశ్నించిన ఈడీ

Excise Policy Scam: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్సమెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సెక్రటరీ కి ఈడీ సమన్లు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ను గురువారం ఈడీ ప్రశ్నించింది.

మరోసారి సిసోడియాకు సమన్లు(Excise Policy Scam)

అయితే, ఇప్పటి వరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ విచారించిన విషయం తెలిసిందే.

మళ్లీ ఫిబ్రవరి 26 న విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ విచారణకు తాను హాజరవుతానని సిసోడియా స్పష్టం చేశారు.

ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ లిక్కర్ విధానం పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో వెనక్క తగ్గిన కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యం విధానాన్ని ఉపసంహరించుకుంది.

అయితే మద్యం కుంభకోణం ఉప ముఖ్యమంత్రి సిసోడియా పేరు ప్రముఖంగా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ కుంభ కోణంపై చేపట్టిన విచారణలో భాగంగా ఇప్పటికే పలు అరెస్టులు జరిగాయి. ఈ కేసును ఈడీ, సీబీఐ వేర్వేరుగా విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే.

సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి , బినోయ్ బాబు,

సమీర్ మహేంద్రు సహా 7గురిని నిందితులుగా పేర్కొంటూ.. సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

అయితే, తాజాగా మరోసారి సిసోడియాకు సమన్లు ఇచ్చింది. ఈ క్రమంలో మళ్లీ కేజ్రీవాల్ పీఏను ఈడీ ప్రశ్నించింది.

అవినీతిని కప్పిపుచ్చేందుకే: బీజేపీ

కాగా, సీబీఐని ఉసిగొల్పి ఉపముఖ్యమంత్రి సిసోడియాను వెంటాడేలా చేసింది లెఫ్టినెంట్ గవర్నర్ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.

మరో వైపు లెఫ్టినెంట్ గవర్నర్ వెనుక బీజేపీ హస్తం ఉందనేది ఆమ్ఆద్మీ ఆరోపణ.

అయితే ఈ ఆరోపణలపై బీజేపీ స్పందిస్తూ సుసోడియా నేతృత్వంలోని ఎక్సైజ్ శాఖలో అవినీతిని కప్పిపుచ్చేందుకే నూతన విధానాన్ని ఉపసంహరించి, పాత విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారంది.