Home / Enforcement Directorate
ఛత్తీస్‌గఢ్ లో బొగ్గు రవాణాపై అక్రమంగా వసూలు చేసిన కేసులో రూ.51.40 కోట్ల విలువైన 90 స్థిరాస్తులు, విలాసవంతమైన వాహనాలు, నగలు, నగదును జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం వెల్లడించింది.
చత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో కాంగ్రెస్ నేత, రాయ్‌పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ స్కామ్ లొ 2,000 కోట్ల విలువైన మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్లు తెలిపింది
ప్రైమరీ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నిందితుల ద్వారా దాదాపు రూ.250 కోట్లు సంపాదించారు. రోజురోజుకు మరిన్ని విషయాలు వెల్లడవుతుండడంతో ఈ మొత్తం రూ.500 కోట్లకు చేరుకోవచ్చని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో తేలింది.
దౌత్య మార్గాల ద్వారా కేరళలోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల జరిపిన సోదాల తర్వాత రూ.1.13 కోట్ల విలువైన ఏడు స్థిరాస్తులు, రూ.27.65 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం వెల్లడించింది.
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది. నేడు ఈడీ కార్యాలయానికి రావాలని.. లేఖ ద్వారా తెలిపింది.
Delhi liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ కొనసాగింది. ఈ మేరకు విచారణ ముగిసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన విచారణ 9గంటల సమయంలో ముగిసింది.
Delhi Liquor Scam: దాదాపు 8 గంటలుగా విచారణ కొనసాగుతోంది. ఈడీ ఆఫీస్‌లోని మూడో ఫ్లోర్లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం కవిత లీగల్ టీం ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఈడీ పిలుపు మేరకు లీగల్ టీం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
Manish Sisodia: దిల్లీ మద్యం కేసులో ఓ వైపు విచారణ వేగంగా సాగుతోంది. ఇదివరకే అరెస్టైన మనీశ్ సిసోడియా తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్ధనను.. సీబీఐ మరోసారి వ్యతిరేకించింది. దీంతో ఈ విచారణ మళ్లీ వాయిదా పడింది.
MLC Kavitha: దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత మరోసారి విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. కవిత వెంట భర్త అనిల్.. ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
MLC Kavitha: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో విచారణకు నేడు ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉంది. అయితే కవిత నేడు హాజరు అవుతారా.. లేదా తన తరపున న్యాయవాదిని పంపిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.