Home / Delhi
రోడ్డు డివైడర్ పై నిద్రిస్తున్న వారిపైకి ఒక్కసారిగా ఓ ట్రక్కు దూసుకెళ్లింది. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో జరిగింది.
ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ (58) ఇక లేరు. స్టాండ్ అప్ కామెడీలో ఒక వెలుగు వెలిగిన శ్రీవాస్తవ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు.
కట్టేసి కొట్టిన ఘటనలో తనను వర్చువల్ స్ధానంలో విచారణ జరపాలని పేర్కొన్న కోర్టు ఉత్తర్వులను సైతం ఏపీ సీఐడి అధికారులు ఉల్లంఘిస్తున్నారని పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణం రాజు మీడియాతో పేర్కొన్నారు
వివాహేతర సంబంధాలు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. చిన్నచిన్న మనస్పర్థలే అనేక సమస్యలకు నెలవుగా మారుతున్నాయి. ఈ క్రమంలో ప్రియుడి మోజులో పడిన ఓ ఇళ్లాలు తన ఇంట్లోనే రూ. 2కోట్లను ఊడ్చేసింది. అదీ చాలనట్టుగా అత్తమామల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ భర్తనే బెదిరించసాగింది. ఈ ఉదంతం ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీలో డెంగ్యూ కేసులు భారీగా నమోదయ్యాయి, గత వారంలో 100 మందికి పైగా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు నగరంలో వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధి యొక్క సంఖ్య దాదాపు 400కి చేరుకుంది.
జిలేబీ దేశమంతటా బాగా ప్రాచుర్యం పొందిన స్వీట్ . అయితే జంబో-సైజ్ జిలేబీని రుచి చూడాలంటే, మీరు బంకురా నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెంజకురా గ్రామాన్ని సందర్శించాలి.
ఢిల్లీలోని ఒక నైజీరియన్ మహిళకు మంకీ ఫాక్స్ పాజిటీవ్ గా నిర్దారణ కావడంతో భారత్ లో కేసులసంఖ్య 13కి చేరుకుంది. మంకీపాక్స్‌తో బాధపడుతున్న మరో వ్యక్తి కూడా ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈసందర్భంగా బంపర్ ఆఫర్ ని ప్రకటించింది ఓ రెస్టారెంట్. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉన్న ఈ రెస్టారెంట్ లో రూపొందించిన ప్రత్యేక తాలీని 40 నిమిషాల్లో లాగించిన వారికి రూ.8.5 లక్షలు ఇస్తామని వెల్లడించింది.
ఢిల్లీకి వెల్లతారు. అక్కడే నివాసం ఉండాలంటారు. అది కూడా అప్పనంగా ప్రభుత్వం నివాసమే కావాలంటారు. ఇది నేటి ప్రజా ప్రతినిధుల తీరు. అలాంటి వారికి ఢిల్లీ కోర్టు ఒప్పుకొనేది లేదంటూ ఓ మాజీ ప్రజాప్రతినిధికి ఖాళీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
విద్యుత్ సబ్సిడీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో మరోమారు ఢిల్లీ ప్రభుత్వం మిస్ట్ కాల్ ఇవ్వండి, విద్యుత్ సబ్సిడీ పొందండి అంటూ ప్రకటించింది.