Home / Delhi
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది . దీన్ని ఉల్లంఘించిన వారికి రూ. 500 జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబకు ఊహించని పరిణామం ఎదురైయింది. చంద్రబాబు ముందే టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు ఎంపీ కేశినేని నాని నిరాకరించారు. బొకే ఇవ్వాలని గల్లా జయదేవ్ బతిమాలిన లెక్కచేయలేదు. చేతికి ఇచ్చిన బొకేను చంద్రబాబు ముందే తోసేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు వసంత్ విహార్ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఈ సంఘటన ఈ నెల 6న జరగ్గా, పోలీసులకు 8వ తేదీన ఫిర్యాదు అందింది. అత్యాచారానికి పాల్పడిన 23 , 25, 35 ఏళ్ల వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోస్కో యాక్ట్ కింది కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. కాగా కొత్త పార్లమెంట్ భవనంపై అశోక స్థంభాన్ని ఆవిష్కరించారు. నిర్మాణపనుల్లో నిమగ్నమైన ఇంజినీర్లతో పాటు కార్మికులతో ప్రధాని ముచ్చటించారు. కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.