Home / crime news
హరియాణాలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్నందుకు ఓ డీఎస్పీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన హరియాణాలోని ఆరావళి పర్వత ప్రాంతంలో జరిగింది. ఆరావళి పర్వత ప్రాంతంలోని నూహ్ జిల్లా పచ్‌గావ్ సమీపంలో అక్రమ క్వారీలు కొనసాగుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో తావ్డూకు డివిజన్ డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఓ బాలిక ఆదివారం పాఠశాల భవనం పైనుంచి దూకి తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె ఐదుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేయడానికి ప్రయత్నించే నేపధ్యంలో ఆమె భవనంపై నుంచి దూకింది. బాధితురాలి సోదరుడి వాంగ్మూలం ఆధారంగా మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని కళింగ నగర్
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు వసంత్ విహార్ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఈ సంఘటన ఈ నెల 6న జరగ్గా, పోలీసులకు 8వ తేదీన ఫిర్యాదు అందింది. అత్యాచారానికి పాల్పడిన 23 , 25, 35 ఏళ్ల వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోస్కో యాక్ట్ కింది కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అత్యాచార కేసులో విచారణ ఎదుర్కుంటున్న సీఐ నాగేశ్వరరావు దురాగతాలు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాగేశ్వర రావు టాస్క్ ఫోర్స్ సీఐ గా ఉన్నప్పుడు చేసిన సెటిల్ మెంట్ల దందాపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సామాన్యుల రక్షణ కోసం ఉపయోగించాల్సిన, లొకేషన్ ట్రేసింగ్ లాంటి వాటిని తన వ్యక్తి గత ప్రయోజనాల కోసం వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావు సస్పెండ్ అయ్యారు. అత్యాచారం, ఆయుధ చట్టం కింద సీఐ నాగేశ్వర్ రావుపై కేసు నమోదయింది. దీనితో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు.