Home / crime news
దుర్గామాత పూజలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్లోని భదోహిలో చోటుచేసుకుంది.
ఎవరైనా కూరలో ఉప్పు తక్కువైతే కాస్త ఉప్ప వేసుకుని తింటారు. లేదా ఇంకేం వేసుకుంటాములే అని సర్దుకుపోయి తింటారు. మహా అంటే వంట చేసిన భార్యని నాలుగు మాటలంటారు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం కూరలో ఉప్పచాలలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
నేటి తరం అబ్బాయిలకు ఒకసారే పెళ్లి కావకడమే కష్టం అంటే ఈ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అదికూడా 28ఏళ్ల వయస్సులోనే అది ఎలా సాధ్యం అయ్యింది అని ఆశ్చర్యపోతున్నారు కదా అయితే ఈ కథనం చదివెయ్యండి.
గుజరాత్ లో రూ. 25కోట్ల 80 లక్షల రూపాయల నకిలీ రెండు వేల రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వీటిని ఓ అంబులెన్సు మాటున తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాయి.
ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో శుక్రవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద జరిగిన పేలుడులో 19 మంది దుర్మరణం పాలయ్యారు.
కర్ణాటకలోని బెళగావిలో తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువతి ప్రియుడితో హత్య చేయించింది. దీనికి గాను ఆమె ‘దృశ్యం’ సినిమాను పదిసార్లు చూసిందని సమాచారం. మరో విశేషమేమిటంటే ఈ హత్యకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం.
వావి, వరుసలు మరిచాడు. నమ్మకంగా ఉంటూనే మోసం చేసాడు. అంతేనా బరితెగించి మరో క్రిమినల్ వ్యవహారాన్ని చేపట్టాడు. చివరకు ఆ వ్యవహారంపై పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఘటన అమీన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొనింది.
సెంట్రల్ రష్యాలోని ఓ పాఠశాలపై సోమవారం ఉదయం ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు విద్యార్థులు సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని ఉద్ముర్తియా ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచాలోవ్ ఓ వీడియో ద్వారా ప్రకటించారు
ఆడుతూపాడుతూ అప్పటివరకూ కళ్లముందే తిరుగుతున్న చిన్నారులు కొద్ది క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. సరదాగా చేపలు పట్టడానికి వెళ్లి నీటికుంటలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో చోటుచేసుకుంది.
అబలల పై దాడులు ఆగడం లేదు. అకారణంగా మహిళల పై దాడులు చేస్తూ భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. తాజాగా భాగ్యనగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ సమీపంలో దారుణం చోటుచేసుకొనింది