Home / crime news
ఓ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. అంతవరకు బాగానే ఉన్నా ఏమనుకున్నాడో ఏమోకానీ ఆ దొంగ ఇంటికెళ్లి "మరోదారి లేక దొంగతనం చేశానంటూ క్షమాపణ మెయిల్ పెట్టాడు". లాప్‌టాప్‌లోని ముఖ్యమైన ఫైల్స్‌ను సదరు ల్యాప్ టాప్ యజమానికి పంపించాడు.
తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ రద్దు చేసింది. పదవ తరగతి పరీక్షా పత్రాల లీక్ కేసులో బెయిల్ పై మంత్రి నారాయణ ఉన్నారు. నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోదుండగులు పదేళ్ల బాలుడు(రజాఖాన్)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.
సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు జంట పేలుళ్ల ఘటన తీవ్ర విషాదాన్ని మరియు భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది మరణించారు. విద్యా మంత్రిత్వ శాఖ భవనం సమీపంలోని రద్దీగా ఉండే జంక్షన్ వద్ద శనివారం నాడు ఈ దాడి చోటుచేసుకుంది.
భాగ్యనగరంలో భారీ కార్పొరేట్ స్కాం వెలుగులోకి వచ్చింది. హీరా మల్టీ వెంచర్స్ యాజమాన్యం చేసిన స్కాం బట్టబయలయ్యింది. 200కోట్ల కంపెనీ షేర్స్ ను 10మంది కుటుంబ సభ్యులకు ఆ కంపెనీ యాజమాన్యం బదలాయించుకుంది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ ప్రతి ఏటా జరిగే హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం రాత్రి పెద్దఎత్తున ప్రజలు ఒక ఇరుకైన వీధి నుంచి వెళ్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 149 మంది మృతి చెందారు.
స్థానికుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మెుదలుపెట్టారు.టీ తయారీకి ఉపయోగించిన వస్తువులను పరిశీలిస్తే ఐతే శివానందన్ భార్య పొరపాటున టీ పొడికి బదులు పొలాలకు వాడే పిచికారీ మందును కలిపినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఒక వివాహ వేడుకలో గులాబ్ జామ్ అయిపోవడంతో రెండు వర్గాల మద్య జరిగిన ఘర్షణలో 22 ఏళ్ల వ్యక్తి మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు
జార్ఖండ్ లో ఆర్మీ కల్నల్ మరియు అతని కుమారుడిని దీపావళి రోజున బాణసంచా కొనుగోలు చేసిన తర్వాత జీఎస్టీ బిల్లు అడిగినందుకు ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ విషయమై గోండా పోలీస్ స్టేషన్లో ఆర్మీ కల్నల్ కుమారుడు ఇషాన్ సింగ్ ఫిర్యాదు చేశారు.
అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో జాబ్-ఫర్-సెక్స్' రాకెట్ సంచలనం సృష్టించింది. మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ తన ఏడాది పదవీ కాలంలో 20 మందికి పైగా మహిళలను పోర్ట్ బ్లెయిర్ నివాసానికి తీసుకెళ్లారని, లైంగిక వేధింపులకు గురిచేసారని దీనికి బదులుగా కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని విచారణలో వెల్లడయింది.