Home / crime news
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ లో సబ్-ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ స్కామ్ లో సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసింది. కశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సురేందర్ సింగ్ తో సహా నలుగురిని సిబిఐ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
రైలులో రూ. 50 కోట్లకు పైగా విలువైన కొండచిలువలు, అరుదైన జాతుల పాములు, ఊసరవెల్లులు తదితరాలను తీసుకెళ్తున్న మహిళను అరెస్టు చేసారు.
ఏ పని చేయాలన్నా పక్కా ప్లానింగ్ ఉండాలంటారు. దాన్ని నిరూపిస్తూ ఓ దొంగల బ్యాచ్ యజమాని ఇంటిని నిలువునా దోచేశారు. నమ్మకంగా ఉంటూనే పక్కా ప్లాన్ తో కోట్ల రూపాయల నగదు, బంగారంతో ఉడాయించిన ఆ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకొనింది.
రాజస్థాన్ బరన్ జిల్లాలోని అంట పట్టణంలో ఓ తల్లి తన 13 ఏళ్ల కూతురిని గొంతుకోసి హత్య చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన పెద్ద కొడుకు ఆరోగ్యం బాగుండాలని కూతురిని హత్య చేసింది. దీనికి సంబంధించి వివరాలివి.
సమాజంలో రోజు రోజుకు నేరాలు అధికమౌతున్నాయి. సంబంధం లేని వ్యవహారాల్లో కూడా క్షణికావేశాలకు గురౌతున్నారు. ఈ క్రమంలోనే వైఫై పాస్వర్డ్ చెప్పలేని కారణంగా ఓ బాలుడిని కత్తి పొడిచి చంపిన ఘటన ముంబైలో జరిగింది.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. శ్మశానవాటికలో యువతి పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
కేరళలో తనతో విడిపోవడానికి నిరాకరించినందుకు తన 23 ఏళ్ల యువకుడికి విషమిచ్చి చంపిన యువతి తరువాత పోలీస్ స్టేషన్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
ఓ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. అంతవరకు బాగానే ఉన్నా ఏమనుకున్నాడో ఏమోకానీ ఆ దొంగ ఇంటికెళ్లి "మరోదారి లేక దొంగతనం చేశానంటూ క్షమాపణ మెయిల్ పెట్టాడు". లాప్‌టాప్‌లోని ముఖ్యమైన ఫైల్స్‌ను సదరు ల్యాప్ టాప్ యజమానికి పంపించాడు.
తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ రద్దు చేసింది. పదవ తరగతి పరీక్షా పత్రాల లీక్ కేసులో బెయిల్ పై మంత్రి నారాయణ ఉన్నారు. నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోదుండగులు పదేళ్ల బాలుడు(రజాఖాన్)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.