Home / Chandrababu Naidu
అంగళ్ళు విధ్వంసం కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులోమ పలువురికి బెయిల్ మంజూరయిన సంగతి తెలిసిందే.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల 28నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకూ సుప్రీంకోర్టుకి సెలవులున్నాయి. విచారణ వాయిదా పడినా లేదా ఆలస్యం అయినా చంద్రబాబు కేసు అక్టోబర్ 3 తరువాతే తేలే అవకాశాలుంటాయి.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం చంద్రబాబును ప్రశ్నిస్తోంది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మెడకి మరో కేసు చుట్టుకుంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సిఐడి పోలీసులు చంద్రబాబుని నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటి వారెంట్ దాఖలు చేశారు.
టీడీపీ, జనసేన పొత్తులపై మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. పవన్ చంద్రబాబును ఓదార్చడానికి వెళ్లారనుకున్నామని అయితే ఓదార్చడానికి వెళ్లారా లేక బేరం కుదర్చుకోవడానికి వెళ్లారా అంటూ నాని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో పవన్ ది ములాఖత్ కాదు మిలాఖత్ అని తేలిందన్నారు.
రాజమండ్రి జైలులో చంద్రబాబుతో కుటుంబసభ్యులు ములాఖత్ అయ్యారు. . చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, బావమరిది రామకృష్ణ తదితరులు చంద్రబాబును కలిసారు. జైలులో చంద్రబాబుకు అందుతున్న సౌకర్యాలు, ఆరోగ్యంపై ఆరా తీసారు. దాదాపు 40 నిమిషాలపాటు ములాఖత్ అయ్యారు.
చంద్రబాబు జోలికి రావడం.. సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పని దీనికి రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేసారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్కు అధికారం అంటే ఏమిటో తెలియదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. మన కోసం ఓ వ్యక్తి నిలబడినప్పుడు తిరిగి మద్దతివ్వడం పద్ధతని ఆయన చెప్పారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్దాయిలో మండిపడ్డారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీనితో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 22 వరకూ చంద్రబాబు రిమాండ్ లో ఉంటారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఉన్న ఆయన బస చేసి బస్సు నుంచి కిందకు రాగానే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో బాబును సిట్, సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఆయన్ని విజయవాడకు తీసుకెళ్లాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.