Home / Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా
1997లో ప్రజా గాయకుడు గద్దర్‌పై జరిగిన కాల్పుల ఘటనలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కాల్పుల అనంతరం గద్దర్ తనతో పలుమార్లు మాట్లాడారని ఆయన స్పష్టం చేశారు. అల్వాల్‌లోని ప్రజా గాయకుడు గద్దర్ నివాసానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులని పరామర్శించారు.
పుంగనూరులో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఎ1 గా చంద్రబాబు, ఎ2గా దేవినేని ఉమ, ఎ3గా అమర్నాధరెడ్డిలపై ముదివేడు పోలీసు స్టేషన్లో ఎఫ్ ఐఆర్ నమోదు చేసారు. ఈ ఎఫ్ఐఆర్ లో 20 మందిపై కేసులు నమోదు చేసారు.
జగన్ మూర్ఖత్వం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. పోలవరం వద్ద సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయిందని ఆరోపించారు.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు రోడ్ షోను సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండపడ్డారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పోలవరాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారని మంత్రి అంబటి ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ కు, పోలవరానికి పట్టిన శని చంద్రబాబు నాయుడేనని ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ ను నిపుణులు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు తమ హయాంలో పోలవరం పనులు 75 శాతం చేసామని చెప్పారని కాని అది అబద్దమన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమగోదారి జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం తరపున దెబ్బతిన్న పంటలను చూసేందుకు ఎవరూ రాలేదని రైతులు ఆవేదనతో ఆయనకు చెప్పుకున్నారు.
అమరావతి భూముల కుంభకోణంపై సిట్ విచారణ కొనసాగించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. సిట్ దర్యాప్తు ప్రాసెస్‌లో ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని, అన్ని కోణాల్లో విచారించి కేసుని తేల్చమని కూడా హైకోర్టు సూచించిందని చంద్రబాబు తెలిపారు.
ఇటీవలి కాలంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడం ఇది మూడోసారి. విశాఖ పట్నంలో పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న సందర్భంగా..