Home / Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి సాధించిన టీడీపీ ఫుల్ జోష్‌లో ఉంది. అలాగే లోకసభ ఎన్నికల్లో టీడీపీ 16 సీట్లు సాధించింది. ప్రస్తుతం బాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ ను ,గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ని తీవ్రంగా విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని హెచ్చరించారు.
జరగ బోయే కురుక్షేత్ర యుద్ధం లో ధర్మం గెలవాలని చంద్ర బాబు అన్నారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స సత్యనారాయణ తాకట్టు పెట్టారని, పదవులన్నీ ఆయన కుటుంబానికేనని విమర్శించారు.
సైకో జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దని, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ నాశనమైందని అన్నారు.
ఇసుక, మద్యం, గనుల మాఫియా డబ్బంతా సీఎం జగన్‌కే వెళ్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రకాశం జిల్లా పొదిలి చిన్నబజార్ కూడలిలో ప్రజాగళం సభలో సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నల్లమల అడవిలోనే ఎర్రచందనం మాయమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఉద్యోగులపై 15వందల కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు పై సినీ నటుడు ,వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరో సారి విరుచుకు పడ్డారు .చంద్రబాబు పబ్లిక్‌గా ఏపీ సీఎం జగన్‌ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు అధికారం అనే ఆకలితో అలమటిస్తున్నారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. 1978లో. చంద్రబాబు ఇంటి పెంకులు కూడా వేయించుకునే స్థితిలో లేరు. ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు అయిపోయారు. ఈ సంపాదన ఎలా సాధ్యపడింది..?మాకు కూడా చెప్తే రాజకీయాలు వదిలేసి మేము కూడా సంపాదించుకుంటామని ముద్రగడ అన్నారు.
చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
అవినీతి మయమైన వైసీపీ ని పాతాళానికి తొక్కేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు .గురువారం సాయంత్రం రాజం పేట జిల్లా రాజం పేటలో కూటమి ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అంటూ నినాదాలు ఇచ్చారు .మన రాష్ట్రం,మన నేల ,మన ప్రజలు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల కూడదని కూటమి కట్టామని అన్నారు .
సీఎం జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.