Home / BRS
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ క్యాడర్‌తో తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడారు. ఫిబ్రవరి నెలనుంచి కేసీఆర్ ప్రతిరోజూ తెలంగాణ భవన్‌కి ప్రతిరోజూ వచ్చి కార్యకర్తలని కలుస్తారని హరీష్ రావు తెలిపారు.
కాంగ్రెస్ చేతిలో పార్టీ పరాజయం పాలైనందుకు తీవ్ర నిరాశకు లోనయినా చింతించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కేటీఆర్ ) అన్నారు. ప్రజాతీర్పును శిరసావహించి సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసారని అన్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అందులో భాగంగానే పలు రాజకీయ పార్టీల అగ్ర నేతలు ఇవాళ అధిక ప్రాంతాల్లో పర్యటన చేయనున్నారు. ఇక మరోవైపు సాయంత్రం ఐదు గంటల నుంచి రోడ్డులన్నీ నిర్మానుష్యం కానున్నాయి. 13 జిల్లాలో సాయంత్రం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. అందులో భాగంగానే అధికార, ప్రాతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో అధికార, ప్రాతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే మోదీ అండగా నిలబడ్డారని చెప్పారు. ఆదివారం ఆందోల్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..
తెలంగాణలో ఎన్నికల సమరంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు.. అధికారం కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరుస మీటింగ్ లతో ప్రజలతో మమేకం అవుతున్నారు. అందులో భాగంగా మంగళవారం మధిర నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం మనకు వద్దు అంటూ ప్రతిపక్షాలపై తనదైన శైలిలో సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయని
ప్రధాని మోదీ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత ఆదివారం నాడు మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం. ఈ వరుస పర్యటనల నేపధ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు.