Home / AP Politics
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలలో కలిపి 10 సీట్లకు గాను తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది.
గత వారం రోజుల్లో గన్నవరం, బేతంచర్లలలో జరిగిన గోడవల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా కదిరిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం.. హిర మండలంలో కూలి పనుల కోసం వచ్చిన వారికి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గేదెల చైతన్య అవగాహన కల్పించారు.
మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయ్.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలుగు రాష్ట్రాలలో ఎంతటి సంచలనంగా మరిందో అందరికీ తెలిసిందే. కాగా 2019 మార్చి 15న ఆయన ఇంట్లోని బాత్రూమ్లోనే వైఎస్ వివేకానంద రెడ్డిని దుండగులు దారుణంగా నరికి చంపారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో సీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు కొనసాగిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంత భూవివాదానికి సంబంధించిన కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు.. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలోని నారాయణ కుమార్తె నివాసాలపై శుక్రవవారం సోదాలు నిర్వహించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కుప్పంలో మొదలైన ఈ యాత్ర ఇప్పుడు తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తిరుపతిలోని యువతతో ముఖాముఖి నిర్వహించారు.
Nara Lokesh on Ntr: యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశంగా మరాయి. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యలే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగుతోంది.
Ys Avinash Reddy: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నేడు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విచారణలో అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు కన్నాకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.