Home / AP Politics
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దాదాపు తెలిసిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఈ ఎన్నికల్లో రుజువైందని గంటా విశ్లేషించారు. రాజధాని వ్యవహారం సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల్లో విశ్వాసం లభించలేదన్నారు. మూడేళ్ల క్రితం దాదాపు 50 ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందన్నారు.
ఏపీలో పట్టభద్రులు (గ్రాడ్యుయేట్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మార్చి 15న రీపోలింగ్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో డిల్లీ వెళ్ళిన సీఎం జగన్ రాత్రి 7.30 గంటల సమయానికి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఈ నెల 13న ఏపీ లోని 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఉదయం 8 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు.
నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డికి బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. పొలిటీషియన్ పొలిటీషియన్‌గానే ఉండాలని సూచించారు. నీచానికి దిగజారకు అంటూ శ్రీనివాసరెడ్డిని ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా తాజాగా ఓ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించడం ఏంటని మండిపడ్డారు.
Janasena Formation Day: జనసేన ఆవిర్భాంచి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని అన్నారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు తనతో కొద్దిమంది మాత్రమే ఉన్నారని.. ఆ సమయంలో రాజకీయాలు ఎలా చేయాలో తనకు తెలియదన్నారు.
Nadendla Manohar: జనం కోసం జనసేన ఆవిర్భవించిందని నాదేండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోగా ఉండి.. కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటూ.. లెక్కలేనంత అభిమాన సముద్రాన్ని సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. కాగా సమాజానికి ఏదైనా చేయాలి.. ప్రజలకు తోడుగా నిలవాలి అనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. ప్రశ్నించడం కోసమే అంటూ ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటున్నారు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే, అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.