Home / AP Politics
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ తుది శ్వాస విడిచారు. ఈ తెల్లవారుజామున తిరుపతిలోని ఆమె నివాసంలో ఆమె కన్నుమూశారు. గత కొంతకాలంగా కుతూహలమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఈరోజు మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయసు 74 సంవత్సరాలు.
కాపుల సామాజిక ఆర్థిక సర్వే కోసం వైఎస్ చర్యలు చేపడితే, చంద్రబాబు ఈబీసీ కోటాలో రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
పవర్ స్టర్ పవన్ కళ్యాణ్ గత నెల 25 వ తేదీన విజయవాడ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన ప్రచార రథం వారాహికి విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కొండపైకి వారాహిని అనుమతించకపోవడంతో ఇంద్రకీలాద్రి కిందనే శాస్త్రోక్తంగా పవన్ పూజలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపట్టాలని అమిత్ షాకు లేఖ రాసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైకాపాకి సొంత పార్టీ నేతలే రివర్స్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో గత కొద్దిరోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది.
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. షర్మిలను చూస్తే జాలి వేస్తుందని కడియం వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలని విమర్శిస్తుండడంతో వైసీపీ - జనసేన, తెదేపా పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది.వీటికి మరింత ఊతాన్ని ఇస్తూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య వర్సెస్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం రాష్ట్రంలో మరింత హీట్ పుట్టిస్తుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.అప్పులతో ఆంధ్రప్రదేశ్ పేరు ను మారుస్తున్నారని జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.ఏపీ సంపద, ప్రగతిని కుక్కలకు వెళ్లనివ్వకండి కానీ మీ వ్యక్తిగత సంపదనను పెంచుకోవడం మర్చిపోవద్దని పవన్ కళ్యాణ్ విమర్శించారు.మీ వ్యక్తిగత సంపద, ఆస్తులు, ఎప్పటికీ అది ఆత్మే అంటూ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం తనకు ఇద్దరు గన్ మెన్లను తొలగించిన నేపధ్యంలో మిగిలిన ఇద్దరు గన్ మెన్లనుకూడ ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
ఏపీలో రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకొని వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా జనసేన బరిలోకి దిగుతుంది. అందులో భాగంగానే మన్యం జిల్లా.. పాలకొండ నియోజకవర్గం .. భామిని మండలంలో జనసేన ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు క్యాలెండర్ లు పంపిణీ చేశారు.
Akhila Priya: నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి అఖిల ప్రియ చేసిన ఆరోపణలు రాజకీయాల్లో వేడిని పెంచాయి. బహిరంగ కు చర్చకు రావాలంటూ.. ఎమ్మెల్యే శిల్పా రవికి భూమ అఖిల ప్రియ సవాల్ విసిరారు. దీంతో అఖిల ప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై తెదేపా నిరసన వ్యక్తం చేసింది.