Home / AP Politics
JanaSena: నసేన ఆవిర్భావ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే బీసీ సదస్సు, కాపు సంఘాలతో ఆయన సమావేశాలు నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం జరిగే ఎన్నికల కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.
మంగళగిరి వేదికగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు జనసేనాధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆర్మీ టైప్ ఫ్యాంట్ బ్లాక్ టీ షర్ట్ వేసుకుని వీర సైనికుడిలా ఇచ్చి ఎంట్రీకి గన్నవరం ఎయిర్ పోర్ట్ ప్రాంగణం పవన్ స్లోగన్స్ తో మారుమోగిపోయింది.
నేను తలచుకుంటే 10 సినిమాల్లో హీరోగా నటించి వాటిని సూపర్ హిట్స్ చేయగలను అంటూ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏకచిత్ర నటుడు అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ప్రశ్నించడం కోసం అంటూ 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ధాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ అభ్యర్దులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఐదేళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది.
తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో కాకినాడ లోని సూర్య గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు.
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలలో కలిపి 10 సీట్లకు గాను తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది.
గత వారం రోజుల్లో గన్నవరం, బేతంచర్లలలో జరిగిన గోడవల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా కదిరిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం.. హిర మండలంలో కూలి పనుల కోసం వచ్చిన వారికి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గేదెల చైతన్య అవగాహన కల్పించారు.