Home / AP Politics
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, కాంగ్రెస్ సర్కారు గురించి, వైకాపా ప్రభుత్వం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ఈబీసీ నేస్తం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ రెండేళ్లలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా రూ. 1258 కోట్లు జమ చేసినట్టుగా సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలోని మహిళలకు భరోసా ఇచ్చేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినట్టుగా సీఎం జగన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటనలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బాలినేనికి అధికారులు ప్రొటోకాల్‌లో ప్రాధాన్యం ఇవ్వలేదు..
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్డింగ్ వేస్తోందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు.
మెగాబైట్స్ గిగాబైట్స్ అంటే సీఎం జగన్ కు తెలియదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచల వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన విమర్శులు చేశారు. తమతో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు ఇంకేమన్నారు అనే విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూసెయ్యండి
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత చేగొండి వెంకట హరిరామ జోగయ్య రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా సినీ నిర్మాత గాను జోగయ్య సేవలు అందించారు. ప్రస్తుతం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈయన ఈరోజు 86 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు (సోమవారం) కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లతో భేటీ కానున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అమిత్ షా, నడ్డాలతో పాటు పలువురు బీజేపీ
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ మరింత హీట్ పెరిగిపోతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న క్రమంలో మాటల యుద్దానికి తెరలేపుతూ వారి వారి శైలిలో దూసుకుపోతున్నారు. ఇన్నాళ్ళూ ఎక్కువ సందర్భాలలో మాటలు, తక్కువ సమయాల్లో మాత్రమే గొడవలు,దాడులు చేసుకోవడం గమనించవచ్చు. అయితే ఇప్పుడు పార్టీల కోసం ప్రజలు లైన్ దాటేస్తునానరని అనిపిస్తుంది.
నెల్లూరు జిల్లాలో రాజకీయం రోజురోజుకీ హీట్ ఎక్కుతుంది. నిన్నటి వరకు మేకపాటి, వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు, మూడు రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వం.. తరిమేస్తామంటూ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు.
చిందేపల్లిలో జనసేన నేతల దీక్షను భగ్నం చేసిన తీరు ఆక్షేపణీయమన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. మూడు రోజులుగా చేస్తున్న నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసిన తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ముఖ్యంగా జనసేన నాయకురాలు కోట వినుత, ఆమె భర్త పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు.