Last Updated:

Chandrababu: రాజకీయ పార్టీల మనుగడను కాపాడుకోవాలి.. అందరం కలిసే సమయం ఆసన్నమైంది- చంద్రబాబు

విశాఖలో పవన్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు చాలా దారుణమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నేను పవన్ తో మాట్లాడాలి, తనను పరామర్శించాలి అనుకున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యమంటే ఇదేనా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Chandrababu: రాజకీయ పార్టీల మనుగడను కాపాడుకోవాలి.. అందరం కలిసే సమయం ఆసన్నమైంది- చంద్రబాబు

Chandrababu: విశాఖలో పవన్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు చాలా దారుణమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నేను పవన్ తో మాట్లాడాలి, తనను పరామర్శించాలి అనుకున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యమంటే ఇదేనా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్మాది పాలనలో పైశాచిక ఆనందం కోసం రాజకీయ నేతలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. విశాఖ పట్టణానికి మేం వెళ్లే అర్హత లేదా ఆయన ఈ రాష్ట్ర పౌరుడు కాదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో మూడేళ్లుగా ప్రజాస్వామ్య పాలన లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో పోలీసులు పవన్ పై దారుణంగా ప్రవర్తించారని పోలీసులు వారి బాధ్యతలను సరిగ్గా చెయ్యాలే కానీ ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరించకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పాలనను నేను చూడలేదంటూ ఆయన అన్నారు. వ్యక్తిగత దూషణ ఎక్కువైందని, దానిపై తిరిగి మాట్లాడిన నేతలపై కేసులు పెడుతున్నారంటూ ఆయన అన్నారు. అటు మీడియాకు ఇటు ప్రజలకు కూడా రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయిందంటూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అందుకే నా మనసు బాధపడి పవన్కు సంఘీభావం వ్యక్తం చేయాలని కల్యాణ్ను కలవడానికి వచ్చానని బాబు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ముందు రాజకీయ పార్టీల మనుగడను కాపాడుదాం తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అంటూ ఆయన పేర్కొన్నారు. సమైక్యంగా అందరం ఆలోచింద్దాం.  రాష్ట్రప్రజలంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే సమయం ఆసన్నమైందని చంద్రబాబు అన్నారు.

ఇదీ చదవండి: అలా చేస్తే “ప్యాకేజీ స్టార్” మాటను వెనక్కి తీసుకుంటాం- పేర్నినాని సవాల్

ఇవి కూడా చదవండి: