Home / Andhra Pradesh latest news
వర్షాలు తెలుగు రాష్ట్రాలను వదలడం లేదు. శీతాకాలం వస్తున్నా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ భారీ వానల ధాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. కాగా కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది.
అది ఓ అరుదైన వ్యాధి. ప్రపంచంలోనే ఏ నలుగురైదుగురో ఈ వ్యాధి బారినపడి బాధపడుతుంటారు. అలాంటి రేర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి సీఎం జగన్ తన దాతృత్వాన్ని చాటాడు. ఆ చిట్టితల్లి వైద్యానికి కోటిరూపాయిలు మంజూరు చేశారు. ఆ డబ్బుతో అత్యంత ఖరీదైన 10 ఇంజెక్షన్లను తొలి విడతగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బాధితులకు ఆదివారం అందించారు.
విశాఖపట్నం వన్ టౌన్ లోని 145ఏళ్ల చరిత్ర గల కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కాగా నేడు అమ్మవారి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భాగంగా గర్భాలయాన్ని అంతా బంగారం, నోట్ల కట్టల నింపేశారు. ఆలయం అంతా పసిడి కాంతులతో నోట్ల దగదగలతో మెరిగిసిపోతుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుపతి జిల్లాలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
నేటి సమాజంలోని పెళ్లికి ముందు ప్రేమలు కామన్ అయిపోయాయి. అయితే అది పెళ్లయిన తర్వాత బ్రేక్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో పెళ్లైనాక కూడా చాటుమాటుగా ప్రేయసితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటారు మరికొందరు. అయితే అది బయటపడిన రోజు భార్యలు చేసే గొడవ అంతా ఇంత కాదు. ఇంక భర్త వేరే వాళ్లతో చనువుగా ఉంటున్నాడంటేనే రచ్చరచ్చ చేసే భార్యలున్న నేటి కాలంలో ఓ ఆడపడుచు తన భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకుని... భర్తకు ప్రేయసిని ఇచ్చి మరల పెళ్లిచేసింది ఈ భార్యామణి.
మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేంతవరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని అమరావతి రైతులు స్పష్టం చేశారు
కృష్ణాజిల్లాలోని ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీనితో ప్రాజెక్టు అధికారులు జలాశయం యొక్క 70గేట్లు పూర్తిగా ఎత్తి వరదనీటిని విడుదల చేస్తున్నారు.