Last Updated:

CM Jagan: చిన్నారికి అరుదైన వ్యాధి.. కోటి రూపాయలు ఇచ్చిన సీఎం జగన్

అది ఓ అరుదైన వ్యాధి. ప్రపంచంలోనే ఏ నలుగురైదుగురో ఈ వ్యాధి బారినపడి బాధపడుతుంటారు. అలాంటి రేర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి సీఎం జగన్ తన దాతృత్వాన్ని చాటాడు. ఆ చిట్టితల్లి వైద్యానికి కోటిరూపాయిలు మంజూరు చేశారు. ఆ డబ్బుతో అత్యంత ఖరీదైన 10 ఇంజెక్షన్లను తొలి విడతగా జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బాధితులకు ఆదివారం అందించారు.

CM Jagan: చిన్నారికి అరుదైన వ్యాధి.. కోటి రూపాయలు ఇచ్చిన సీఎం జగన్

CM Jagan: అది ఓ అరుదైన వ్యాధి. ప్రపంచంలోనే ఏ నలుగురైదుగురో ఈ వ్యాధి బారినపడి బాధపడుతుంటారు. అలాంటి రేర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి సీఎం జగన్ తన దాతృత్వాన్ని చాటాడు. ఆ చిట్టితల్లి వైద్యానికి కోటిరూపాయిలు మంజూరు చేశారు. ఆ డబ్బుతో అత్యంత ఖరీదైన 10 ఇంజెక్షన్లను తొలి విడతగా జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బాధితులకు ఆదివారం అందించారు.

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేరానికి చెందిన కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతుల రెండున్నరేళ్ల కుమార్తె హనీ. ఈ చిట్టితల్లికి పుట్టుకతోనే గాకర్స్‌ వ్యాధి ఉంది. ఈ అరుదైన వ్యాధి కారణంగా చిన్నారి హనీ కాలేయం పనిచేయదు. కాగా గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగాన ఇటీవల గంటి పెద్దపూడిలో సీఎం జగన్‌ పర్యటించారు. ఈ క్రమంలోనే హనీ తల్లిదండ్రులు తమ పాపను బ్రతికించండి అంటూ ప్లకార్డును పట్టుకుని ఉండడం సీఎం కంటపడింది. వెంటనే కాన్వాయ్‌ను ఆపించి హనీ తల్లిదండ్రులతో జగన్ మాట్లాడారు. దానితో హనీకి సోకిన వ్యాధి, చేయాల్సిన వైద్యంపై ఆయన ఆరా తీశారు. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ఖర్చులకు వెనుకాడవద్దని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను సీఎం ఆదేశించారు.

దానితో కలెక్టర్‌ ఆ చిన్నారి వైద్య గురించి సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం రూ.కోటి నిధులను మంజూరు చేసింది.
ఆ నిధులతో తెప్పించిన అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లను నేడు జిల్లా కలెక్టర్‌ హనీ తల్లిదండ్రులకు అందజేశారు. హనీకి వచ్చిన గాకర్స్‌ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజెక్షన్లు మంజూరు చేసిందని కలెక్టర్‌ వెల్లడించారు. ఒక్కో ఇంజెక్షన్‌ ఖరీదు రూ.1.25లక్షలు అని ఆయన వివరించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా చిన్నారికి ఈ ఇంజెక్షన్‌ ఇవ్వనున్నారు. చిన్నారి భవిష్యత్తు, చదువు పరంగానూ ప్రభుత్వం తరఫున సాయం అందించాలని సీఎం ఆదేశించారని కలెక్టర్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి: చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్.. నెల్లూరులో ఆచూకి..!

ఇవి కూడా చదవండి: