Home / Andhra Pradesh latest news
ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం నాడు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా సుచరిత విజయం సాధించారు.
పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఇప్పటం గ్రామంలోని బాధితుల పరామర్శకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన వాహనాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానితో వాహనం దిగి ఆయన మూడు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు. "వైసీపీ గూండాల అరాచకాలు ఇలాగే సాగితో ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం" అని పవన్ హెచ్చరించారు.
నేడు జనసేనాని ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా పవన్ ను అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం తీరుపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. ఏ పార్టీ పీఏసీ మీటింగ్ అయిన జరిగినప్పుడు వారు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజమని కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన ఇవాళ జనసేన తన రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశం జరిపిందంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ నేత పట్టాభిరామ్ ముద్దుగా బొద్దుగా రసగుల్లాలా ఉంటాడని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు.
ఆరోగ్యశ్రీలోకి కొత్తగా 809 చికిత్సలను చేర్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి రామకృష్న తెదేపా, జనసేనలతో కలిసి నడిచేందుకు తాము రెడీ అంటూ ప్రకటించారు.
గత కొద్దిరోజుల నుంచి తెలుగురాష్ట్రాల ప్రజలను ఎడతెరపిలేని వర్షాలు అల్లాడిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. నేడు ఏపీలోకి ఈ యాత్ర ప్రవేశించింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో నేడు మొదలైన రాహుల్ పాదయాత్ర ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది.
AP : ఏపీలో వైరల్ గా మారిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు