Last Updated:

Telugu Warriors: కేరళ పై తెలుగు వారియర్స్ విక్టరీ.. ఇరగదీసిన అక్కినేని అఖిల్

Telugu Warriors: సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ ప్రేక్షకులకు.. సినీ అభిమానులకు ఉర్రుతలూగిస్తుంది. సీసీఎల్ సీజన్.. మెుదలైంది. నేడు జరిగిన తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ రేపింది. కాగా ఈ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ విజయం సాధించింది.

Telugu Warriors: కేరళ పై తెలుగు వారియర్స్ విక్టరీ.. ఇరగదీసిన అక్కినేని అఖిల్

Telugu Warriors:సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ ప్రేక్షకులకు.. సినీ అభిమానులకు ఉర్రుతలూగిస్తుంది. సీసీఎల్ సీజన్.. మెుదలైంది. నేడు జరిగిన తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ రేపింది. కాగా ఈ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ విజయం సాధించింది.

భారతదేశంలో సినిమా, క్రికెట్ అంటే అభిమానులకు ఎక్కడి లేని ఉత్సాహం వస్తుంది. దేశంలో ఎక్కువ మంది చూసేవి కూడా ఇవే.. ఇక ఈ రెండిటిని ఒకటి చేస్తూ అభిమానులకు కిక్కిచ్చేది సెలెబ్రెటీ క్రికెట్ లీగ్. వెండితెర పై అదిరిపోయే ఫైట్లు చేసే హీరోలు.. బ్యాట్, బంతి తో చేసే విన్యాసాలు మరొకటి. బ్యాట్, బంతి పట్టుకొని ఫీల్డ్ లోకి దిగి బౌండరీలు కొడుతుంటే ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమలు పాల్గొనే ఈ సీసీఎల్ మ్యాచుల్లో అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది. కొంత కాలంగా ఈ మ్యాచ్ లు నిర్వహించడం లేదు. దీనికి ప్రధాన కారణం కరోనా. ఇప్పుడు పరిస్థితులు మెరుగు పడటంతో.. ఈ సీజన్ మళ్లీ ప్రారంభమైంది. ఈసారి మొత్తం ఎనిమిది సినీ పరిశ్రమల నుంచి ఎనిమిది జట్లు ఆడుతున్నాయి. నిన్నటి నుంచి సీసీఎల్ మొదలు కాగా.. నేడు తెలుగు వారియర్స్- కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఇరగదీసిన అక్కినేని అఖిల్.. (Telugu Warriors)

మెుదటి మ్యాచ్ లో అక్కినేని అఖిల్ బ్యాట్ తో ఇరగదీశాడు. టాస్ గెలిచిన కేరళ స్టార్స్ బౌలింగ్ ని ఎంచుకున్నారు. ఇక మొదటిగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్.. 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన అక్కినేని అఖిల్.. 30 బంతుల్లో 91 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. తనతో పాటు గ్రీస్ లో నిలిచిన యువ హీరో ప్రిన్స్ 23 బంతుల్లో 45 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. వీరిద్దరి తరువాత గ్రీస్ లోకి హీరో సుధీర్ బాబు 2 బంతుల్లో 2 పరుగులు, అశ్విన్ బాబు 6 బంతుల్లో 15 పరుగులు చేశారు.

ఇక 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ స్టార్స్ బ్యాటింగ్ లో తేలిపోయారు. తెలుగు వారియర్స్ బౌలర్లు వారిని కట్టడి చేశారు. 10 ఓవర్లలో కేవలం 98 పరుగులు మాత్రమే చేశారు. హీరో ప్రిన్స్ నాలుగు వికెట్లు తీయగా.. నందకిషోర్ ఒక వికెట్ తీశాడు. అత్యధిక పరుగులు చేసినందుకు అఖిల్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.