WTC Final: ఉత్కంఠ మ్యాచ్ లో కివీస్ గెలుపు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన భారత్
WTC Final: న్యూజిలాండ్- శ్రీలంక మధ్య జరిగిన మెుదటి టెస్టులో కీవీస్ అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరి బంతికి కివీస్ విజయం సాధించింది. ఈ విజయంతో.. భారత్ నేరుగా వరల్ట్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
WTC Final: న్యూజిలాండ్- శ్రీలంక మధ్య జరిగిన మెుదటి టెస్టులో కీవీస్ అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరి బంతికి కివీస్ విజయం సాధించింది. ఈ విజయంతో.. భారత్ నేరుగా వరల్ట్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
చివరి బంతికి నెగ్గిన కివీస్.. (WTC Final)
డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ నీళ్లు చల్లాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అజేయమైన సూపర్ సెంచరీ సాధించిన కేన్.. కివీస్ కు అపురూప విజయాన్ని అందించాడు. దీంతో పాటు లంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు. సెంచరీతో చెలరేగిన కేన్.. ఆఖరి బంతి వరకు నిలబడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్టుతో సంబంధం లేకుండా భారత్ నేరుగా.. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కి దూసుకెళ్లింది. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు లండన్ లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
What a Test match – Kane Williamson has done it for New Zealand and India. pic.twitter.com/9JJeUjNZAM
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2023
మెుదటి టెస్టులో శ్రీలంక నిర్ధేశించిన 321 పరుగుల లక్ష్యాన్ని8 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. కేన్ విలియమ్సన్ 121 పరుగులు సాధించగా.. డారిల్ మిచెల్ 81 పరుగులతో
బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. న్యూజిలాండ్ కు విన్నింగ్ రన్ ఎక్స్‌ట్రా రూపంలో రావడం విశేషం. 2019- 21 సీజన్ లో న్యూజిలాండ్ కోహ్లి సేనపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన జట్టుగా కివీస్ చరిత్ర సృష్టించి.. తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఇక నాడు టీమిండియా ట్రోఫీ గెలవకుండా అడ్డుకున్న న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఈసారి మాత్రం ఆటగాడిగా తమ జట్టును గెలిపించడంతో పాటు భారత జట్టును ఫైనల్ చేర్చడంలో పరోక్షంగా ప్రధాన పాత్ర పోషించాడు.
పాయింట్ల పట్టికలో ఇలా..
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం 68.52 శాతంతో ఆసీస్ ఉండగా.. భారత్ 60.29 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే వెస్టిండీస్‌పై సిరీస్‌ను గెలిచిన దక్షిణాఫ్రికా 55.56 శాతంతో మూడో స్థానంలోకి వచ్చింది. ఇక కివీస్ చేతిలో తొలి టెస్టులో ఓటమిపాలైన శ్రీలంక 48.48 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు భారత్ – ఆసీస్ నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా స్థానాల్లో మార్పు ఉండకపోవచ్చు. కానీ, శాతం మారే అవకాశం ఉంది.